గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ వైస్ చైర్మన్ కళ్యాణ్ పద్మా బాయ్ నర్సింగ్ కౌన్సిలర్స్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలలో తమకు భావక స్వాములు చేయడం లేదని, కాంగ్రెస్ పార్టీ నాయకులు

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ మార్చ్ 24గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఫోట్కాల్ పాటించని కాంగ్రెస్ కొన్సలార్లు అధికార దాహంతో ప్రోటోకాల్ పాటించడం లేదని గజ్వేల్ ఆర్డిఓ కార్యాలయంలో ఆర్డీవో చంద్రకళ ఇన్చార్జ్ ఎమ్మార్వో వినతి పత్రాన్ని అందించారు ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలి కానీ ప్రజాస్వామ్యం చేత ఎన్నుకోబడిన ప్రతినిధులకు కాకుండా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు లొంగి అధికారులు వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణం. ప్రజాస్వామ్యం అంటే ఏదైనా ప్రజా పాలన అంటే ఇదేనా రంజాన్ తోఫాలో పంపిణీలో రంజాన్ తోఫాలను అధికారులు మున్సిపల్ పాలక వర్గాన్ని అనుసరించి కంపెనీలు భాగస్వామ్యం చేసి అందించవలసిన బాధ్యత అధికారులపై ఉంది కానీ, అధికారులు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు తలోగ్గి పాలకవర్గానికి సమాచారం లేకుండా రంజాన్ తోఫాలను కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందించడం చాలా దారుణం. రంజాన్ తోఫాలను నిరుపేద ముస్లింలకు పంపిణీ చేయాలి. కానీ నేడు అధికార దాహంతో కేవలం కాంగ్రెస్ పార్టీ ఏలాంటి పారదర్శక లేకుండా ప్రోటోకాల్ లేని వ్యక్తులు రంజాన్ తోఫాలను కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేయడం చాలా దారుణం ఇదేనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన అంటే. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ముస్లిం పేద ప్రజలు తమకు ప్రభుత్వం నుండి రావలసిన రంజాన్ తోఫాలు అందలేదని, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే పంచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ముస్లిం మైనార్టీ ప్రజలకు ప్రభుత్వం నుండి అందవలసిన సంక్షేమ ఫలాలు కేవలం తమ సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రమే పంచుకుంటున్నారనీ పేద మైనార్టీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రంజాన్ తోఫాల పంపిణీలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు తలోగ్గి అధికారులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పంపిణీ కార్యక్రమం చేయడం చాలా దారుణం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన తమకు తెలియకుండా ఏ ఒక్క కార్యక్రమాన్ని చేపట్టరాదని ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రోటోకాల్ ని పాటించాలని ప్రోటోకాల్ లేని వ్యక్తులు ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనవద్దని గజ్వేల్ ఆర్డిఓ మరియు ఇన్చార్జి ఎంఆర్ఓ గజ్వేల్ పెట్టినావు మున్సిపాలిటీ పాలకవర్గం వినతిపత్రాన్ని అందించారు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా అధికారులు సరైన చర్యలు తీసుకోనీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అతేలి శ్రీనివాస్, మామిడి శ్రీధర్, కామునీ మురళి, బోగ్గుల స్వప్న సురేష్ కోట బాబు, గోలి మమతా సంతోష్, కప్పమమత పోచయ్య, భాగ్యలక్ష్మి కనకసేన, కొలిచెల్మి భవాని, తదితరులున్నారు