గురుకుల విద్యార్థుల సంక్షేమంపై రాజీ పడే .ప్రసక్తే లేదు

పయనించే సూర్యుడు మార్చి 24 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల మరియు హాస్టల్‌ను సోమవారం సూళ్లూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని గురుకులాలు, హాస్టళ్లలో నాణ్యత, భోజన సౌకర్యాలు మరియు విద్యార్థుల భద్రతపై ఇచ్చిన ఆదేశాల మేరకు ఎమ్మెల్యే తనిఖీ నిర్వహించారు. ఎమ్మెల్యే స్వయంగా వంటశాలను పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, భోజన నాణ్యతలో ఏవైనా లోపాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. హాస్టల్ గదులు, స్టోర్ రూమ్ మరియు పరిసరాలను పరిశుభ్రతను తనిఖీ చేశారు. విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం మరియు విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చదువుపై శ్రద్ధ వహించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారిని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ: "ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేద విద్యార్థుల భవిష్యత్తుకు పెద్దపీట వేస్తోంది. మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు. ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ప్రతి హాస్టల్, ప్రతి పాఠశాల కార్పొరేట్ స్థాయికి ధీటుగా ఉండాలి. విద్యార్థుల ఆరోగ్యం మరియు భద్రత విషయంలో వార్డెన్లు, ఉపాధ్యాయులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి పైసా విద్యార్థులకే చేరాలని మా ఆకాంక్ష." అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఇతర నాయకులు పాల్గొన్నారు