గేదెలకు గాలికుంటూ టీకాల పంపిణీ.

★ గాలికుంటు టీకాలు వేస్తున్న పశు వైద్య సిబ్బంది.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 24 సాలూర : సాలూర మండలం కుమ్మన్ పల్లి గ్రామంలో పశు వైద్య సిబ్బంది సోమవారం గేదెలకు గాలికుంటు టీకాలను పంపిణీ చేశారు.పాడి రైతులు తప్పనిసరిగా తమ వద్ద ఉన్న గేదెలకు గాలికుంటు టీకాలను వేయించాలని పశువైద్య సిబ్బంది వెల్లడించారు.గాలికుంటు టీకాలు గేదెలకు వేయడం వలన ఆరోగ్య సమస్యలు రాకపోవడంతో పాటు గేదెలకు ఇమ్యూనిటీ శక్తిసామర్థ్యాలు పెరుగుతుందని సిబ్బంది పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శీలం మహేందర్ రెడ్డి,పశువైద్య సిబ్బంది,పాడి రైతులు ఉన్నారు.