పయనించే సూర్యుడు మార్చి 24 రాజేష్) దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామంలో సేవా స్పూర్తికి మరో మంచి ఉదాహరణ నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన రాస్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వారి సిబ్బంది మరియు భూపాల్ గ్రామానికి చెందిన సహకారంతో గ్రామ పెద్దలు కూర్చునేందుకు ఉపయోగపడేలా ఏడు సిమెంట్ బెంచీలు గ్రామానికి బహూకరించారు. ఈ కార్యక్రమం గ్రామస్థులలో ఆనందాన్ని నింపింది. దౌల్తాబాద్ మండలం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి అలాగే గ్రామ పెద్దలు, యువత ఈ సేవా కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి ఇలాంటి దాతృత్వం ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ, “గ్రామంలో పెద్దలు కూర్చుని చర్చలు చేసుకునే స్థలం ఉండటం అనేది మా సామాజిక ఐక్యతకు బలంగా ఉంటుంది. నవీన్ రెడ్డి చేసిన ఈ సహాయం చిన్నదిగా కనిపించినా, గ్రామానికి ఎంతో పెద్ద ఉపయోగం కలిగిస్తుంది” అని అభిప్రాయపడ్డారు. మరో గ్రామ పెద్ద మాట్లాడుతూ, “సేవ చేసేవారే నిజమైన నాయకులు. సమాజం కోసం ముందుకు వచ్చి ఇలాంటి సహాయం చేయడం అందరికీ ఆదర్శం. నవీన్ రెడ్డి గారి సేవాభావం మాకు ప్రేరణగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో ఐక్యత, సహకారం మరింత బలపడుతుందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు