గోపనపల్లి నివాసితులతోపాటురవీంద్ర ప్రసాద్ దూబే అక్రమనీటి వ్యాపారం ఆపాలనిఎమ్మార్వో మైపాల్ రెడ్డికిఫిర్యాదు

పయనించే సూర్యుడు, మార్చి 24 రంగారెడ్డిజిల్లా ప్రతినిధి ఎస్ఎంకుమార్ గోపనపల్లిలో అక్రమ నీటి తరలింపు తీవ్ర తాగునీటి సంక్షోభం,ఎమ్మార్వోకు గ్రామస్థుల ఫిర్యాదు శేరిలింగంపల్లి మం డలం పరిధిలోని గోపనపల్లి గ్రామంలో భూగర్భ జలాల అక్రమ వినియోగం, ట్యాంకర్ల ద్వారా నీటి తరలింపుల కార ణంగా తీవ్ర తాగు నీటి సంక్షోభం నెలకొం ది.ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ సమ స్యపై గ్రామస్థులు పలుమార్లు అభ్యంత రం వ్యక్తం చేసినప్పటికీ పరిస్థితి మరింత విషమించిందని తెలిపారు.గ్రామ పరిధి లో పెద్ద ఎత్తున బోర్లు ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని వాణిజ్య అవస రాల కోసం తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. దీని ప్రభావంతో భూగర్భ జల మట్టాలు గణనీయంగా పడిపోయి బోర్లు ఎండిపో యాయి.ప్రస్తుతం 1200 నుంచి 2000 ఫీట్లు బోర్లు వేసినా నీరు అందని పరిస్థితి నెలకొంది. ఫలితంగా గ్రామ ప్రజలు రోజు వారీ అవసరాలకు కూడా తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యపై గతంలో పలు మార్లు గ్రామస్థులు ట్యాంక ర్లను అడ్డుకుని నిరసనలు వ్యక్తం చేసిన ప్పటికీ తాత్కాలిక చర్యలకే పరిమిత మైందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిపై సోమ వారం (23-03-2026) గోపనపల్లి గ్రామస్థులు శేరిలింగంపల్లి ఎమ్మార్వో మహిపా ల్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసి అక్రమ నీటి తరలింపును అరికట్టడంతో పాటు సమ స్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మార్వో మహిపాల్ రెడ్డి విచారణ జరిపి పూర్తి స్థాయిలో చర్యలు తీసు కుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్య క్రమంలో గ్రామస్తులు రాజు నాయక్, మూలగిరి శ్రీనివాస్, సురేందర్, శివకుమార్, వే ణు,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.