పయనించే సూర్యుడు న్యూస్ చండూరు మార్చి 24. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున చండూరు లో బీజేపీ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలులో వైఫల్యాలను నిరసిస్తూ బీజేపీ చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ పిలుపు నేపథ్యంలో, చండూరు మున్సిపాలిటీ మరియు మండల బీజేపీ నాయకులు బిజెపి మండల పార్టీ అధ్యక్షులు ముదిగొండ ఆంజనేయులు, అన్నెపర్తి యాదగిరి, బోడా ఆంజనేయులు, దోటి కిరణ్ , కాసాల వెంకట్ రెడ్డి, భూతరాజు శ్రీహరి, తదితరుల ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి చండూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు .