పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 24 పెనుగంచిప్రోలు మండలం, నవాబుపేట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, సొసైటీ చైర్మన్ చింతా వెంకటేశ్వరరావు (బుల్లి) ఈరోజు తెల్లవారుజామున అకాల మరణం చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విషయం తెలుసుకున్న జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) వెంటనే నవాబుపేట గ్రామంలోని బుల్లి నివాసానికి చేరుకొని, బుల్లి భౌతిక కాయాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బుల్లి పార్టీకి విశేష సేవలు అందించిన అంకితభావ నాయకుడని, ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.