పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 24.03.2026 మదనపల్లె అన్నమయ్యజిల్లా పుంగనూరు నియోజకవర్గ0 ప్రతినిధి జె. నాగరాజ) చౌడేపల్లి ..ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏ మండలంలో కూడా లేని గ్యాస్ దందా చౌడేపల్లిలో జరుగుతుంది. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.. ప్రజలకు వంటగ్యాస్ అందక ఇబ్బందులు – డీలర్ల అక్రమాలపై మండలంలో ఆగ్రహం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా వంటగ్యాస్ కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుండగా, కొన్ని గ్యాస్ డీలర్లు మాత్రం తమ స్వార్థ ప్రయోజనాల కోసం విచ్చలవిడిగా బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్లు విక్రయిస్తూ సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్న మండల ప్రజలు. ప్రత్యేకంగా చౌడేపల్లి మండల పరిధిలోని శబరీష్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ లో గ్యాస్ సిలిండర్లను అక్రమంగా బ్లాక్‌లో 1200 నుండి 1500 అమ్మేస్తున్నారని బస్టాండులో బహిరంగంగా చర్చించుకున్న వైనం., సాధారణ వినియోగదారులకు సరఫరా చేయాల్సిన సిలిండర్లను దారి మళ్లిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్యాస్ కోసం ప్రశ్నించిన ప్రజలపై తిరగబడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు ఇక బోయకొండ, రాయల్‌పేట వంటి ప్రాంతాల్లోని హోటళ్లకు భారీగా సిలిండర్లు తరలిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి వెంటనే సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి ఈ అక్రమాలపై దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని. ఉదాహరణకు ఒక 85 సంవత్సరాల ముసలమ్మ ఆమెకు కనెక్షన్ మంజూర అయ్యి14 సంవత్సరాలు కావస్తుండగా మూడు సిలిండర్లే తీసుకున్నాను అని చెబుతుంది. కానీ గ్యాస్ ఏజెన్సీ వారు గత 20వ తేదీ తీసుకున్నారని చూపిస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం. సామాన్యులు నేను తీసుకోలేదు అంటున్నారు. గ్యాస్ ఆఫీస్ లో పనిచేసే వారు. మాత్రం ఈ కేవైసీ లేదంటున్నారు ఈ కేవైసీ లేనప్పుడు సిలిండర్ ఎవరు తీసుకున్నట్టు. వివరాలు తెలపాలని మండలంలోని కొందరు గ్రీవెన్స్ . అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్ నిశాంత్ కుమార్ గ్రీవెన్స్ లో కలవడానికి బయలుదేరుతున్నారని సమాచారం. వీటిపై సమగ్ర విచారణ జరిపి పెన్షన్ దారులకు వికలాంగులకు దీపం కనెక్షన్ ఉన్నవారికి తగు న్యాయం చేస్తారని ప్రజలు కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా బయటి దేశాల యుద్ధ సమయంలో భారత్ దేశానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా. చూసుకుంటుంటే ఇలాంటి వారు పట్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అని ప్రజలు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో సమర్థవంతమైన నాయకులు ఉన్నందున ఎటువంటి కొరతలు లేకుండా నిత్యవసరాలు సరఫరా చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది ఏజెన్సీలు వారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీస్తున్నారు. దీనిపై వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేస్తారని ప్రజలు కోరుకుంటున్నారు.. సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వంటగ్యాస్ సరఫరా జరిగేలా చూడాలని మండల ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.