జలగలగెడ్డ గ్రామస్థులకు న్యాయం చేయాలి హుకుంపేట వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండల రావు నిరాహార దీక్ష లో పాల్గొన్నారు

పయనించే సూర్యుడు మార్చి తేదీ 24 రూలర్ ప్రతినిధి బాసు అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు నియోజవర్గం పరిధిలో గల జలగలగెడ్డ గ్రామస్థుల కు న్యాయం చేయాలనీ హుకుంపేట మండల పరిషత్ వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు డిమాండ్ చేశారు. వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు సోమవారం దీక్ష శిబిరాన్ని సందర్శించి 15 రోజుల నుండి జలగల గెడ్డ గ్రామస్థులు చేస్తున్న పోరాటానికి మద్దతు పలికారు. వైస్ ఎంపీపీ కొండలరావు మాట్లాడుతూ…ఆదిమ పీవీటీజీ గిరిజనుల అభివృద్ధి కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తున్నామని ఓ వైపు ప్రచారం చేస్తుంటే…ఇంకో వైపున గ్రామానికి జన్ మన్ పధకంలో మంజూరైన తారు రోడ్డు ను అక్రమంగా కంచే వేసి,నాటు సారా కాస్తూ రాక పోకలను అడ్డు కుని ఆపై దాడికి పాల్పడి 15 రోజు లైన , ముద్దాయిలపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయక పోవడం పై మండి పడ్డారు. ఆదిమ పీవీటీజీ గిరిజనులు అభివృద్ధి కి కూటమి ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే దాడులకు కారణమైన గిరిజనేతరులు గూడూరు కిషోర్,పండు ల పై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. 15 రోజుల నుండి ఐటీడీఏ ఎదుట పిల్లా,పాపాల తో…జలగల గెడ్డ గ్రామస్థులు చేస్తున్న నిరాహారదీక్ష లు అరకు, పాడేరు ఎమ్మెల్యేలు,అరకు ఎంపీ, జీసీజీ చైర్మన్, విజయ నగరం ఆర్ టీ సీ జోనల్ చైర్మన్, జానపద కళలు సాంస్కృతి చైర్మన్ లకు కనిపించక పోవటం విచారకరమన్నారు.ఈ కార్యక్రమంలో కిల్లో రాజన్,పాంగి దేముడు, నవీన్ ,భాస్కర్ రావు గ్రామస్తులు మరియు తదితరులుపాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *