జాతీయ సెమినార్‌ను విజయవంతం చేయాలి

పాలెం ప్రిన్సిపల్ డా. పి.రాములు

పయనించే సూర్యుడు మార్చి 24 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలం పాలెం శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈనెల 25న బయోరిమిడియేషన్‌పై జాతీయ సెమినార్ నిర్వహించనున్నారు. రసాయన వ్యర్థాల నిర్వహణలో పర్యావరణహిత పరిష్కారాలపై అవగాహన పెంపొందించడం ఈ సెమినార్ ముఖ్య లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు. ఈ సెమినార్ బ్రోచర్‌ను హైదరాబాద్‌లోని కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో జిట్టా బాలకిష్టా రెడ్డి, జాయింట్ డైరెక్టర్ రాజేందర్ సింగ్ విడుదల చేశారు. రసాయన కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో బయోరిమిడియేషన్ పద్ధతులు కీలకమని వారు పేర్కొన్నారు. ప్రిన్సిపల్ డా. పి. రాములు మాట్లాడుతూ, ఈ సెమినార్ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి పరిశోధనలకు దోహదం చేస్తుందని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *