తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కమిటీ సభ్యులకు గణ సన్మానం

పయనించే సూర్యుడు, మార్చి 24 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలో మాలల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కమిటీ సభ్యులకు సోమవారం గణగ సన్మానం నిర్వహించారు. వెల్దండ మాలల కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల పోరం కమిటీ నాగర్ కర్నూల్ జిల్లా చైర్మన్ గా జంగిలి నిరంజన్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే వెల్దండ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కమిటీ ఏర్పాటు చేసి మండల కమిటీ, గ్రామ కమిటీ లను ఎన్నుకోబడింది. నూతన మండల కమిటీ అధ్యక్షులు సిరిసనగండ్ల శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు జంగిలి ప్రసాద్, మరియు గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు జంగిలి రవికుమార్, జంగిలి ప్రవీణ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకోబడిన సభ్యులకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మాలల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కమిటీ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల మాల కమిటీ సభ్యులు ఏకుల వెంకటేష్, సింగిల్ విండో డైరెక్టర్ కేశమల్ల కృష్ణ, కొట్ర గ్రామ సర్పంచ్ శారదచెన్నయ్య, నిరంజన్, ఆనంద్ రాజ్, యాదగిరి, అశోక్ కుమార్, వెంకటయ్య, ప్రశాంత్, శ్రీను, సైదులు, సుధాకర్, రాజన్న, రాజు, కృష్ణయ్య, చెన్నకేశవులు, విద్యాసాగర్, కృష్ణయ్య, విష్ణు, నిఖిల్, భాను, తదితరులు పాల్గొన్నారు.