పయనించే సూర్యుడు న్యూస్ చండూరు మార్చి 24 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆధునిక వసతులతో, నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధించే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గాల్లో ప్రారంభించింది. ఇవి డే-స్కాలర్ పద్ధతిలో, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా, డిజిటల్ తరగతి గదులు, 1,500 మంది విద్యార్థుల సామర్థ్యంతో ఏర్పాటు చేయబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ విద్యాసంవత్సరం నుండి ఆధునిక వసతులతో ప్రారంభించబోయే తెలంగాణ పబ్లిక్ స్కూల్ చండూర్ లో ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ముదిగొండ ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. ఈ బడులు ప్రీ-ప్రైమరీ నుండి 8వ తరగతి వరకు ప్రారంభమై, అనంతరం 9-12 తరగతులకు విస్తరిస్తాయని ఈ పాఠశాలల్లో ఏ ఐ బోధన, ఉచిత అల్పాహారం మరియు పూర్తి స్టూడెంట్ కిట్‌లు అందిస్తారని అన్నారు. మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు అన్ని అర్హతలు ఉన్నాయని, చండూర్ హైస్కూల్ ని ఆధునికీకరించి టి పి యస్ గా ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గ పరిధిలోని మునుగోడు లో ఇంటిగ్రేటెడ్ స్కూల్, మర్రిగూడ నాంపల్లి లో మోడల్ స్కూల్, నారాయణపురం సర్వేల్ లో గురుకులం ఉన్నాయని, కేవలం చండూరు ప్రభుత్వవిద్యా పరంగా వెనుకబడి ఉన్నదని, కనీసం దీనినైనా ఇక్కడ ప్రారంభించాలని కోరారు. వీటి లక్ష్యం ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం, ఈ పథకం కోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 500 కోట్లు కేటాయించారని, కేజీ టూ పీజీ (కిండర్ గార్టెన్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్) వరకు విద్యను అందించాలనేది ప్రధాన సంకల్పం కాబట్టి భారతీయ జనతా పార్టీ మున్సిపల్, మండల కమిటీల ఆధ్వర్యంలో టి పి యస్ కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు భూతరాజు శ్రీహరి, బిజెపి జిల్లా నాయకులు అన్నెపర్తి యాదగిరి, వరికుప్పల గిరి, పార్టీ ప్రధాన కార్యదర్శులు ఆవుల అశోక్ యాదవ్, సోమ శంకర్, మండల ఉపాధ్యక్షులు జెట్టి యాదయ్య, మండల కార్యదర్శి దాసరి శంకర్, మున్సిపల్ నాయకులు మన్నెం ప్రవీణ్, దోటి శివ, భూతరాజు వేణు, మోర్చా అధ్యక్షులు పులిజాల రవీందర్, దోటి నరేష్, బూత్ అధ్యక్షులు నిమ్మల వెంకన్న, నాయకులు జక్కలి సందీప్ తదితరులు పాల్గొన్నారు.