నేలకొండపల్లిలో ప్రయాణికుల కష్టాలు

పయనించే సూర్యుడు న్యూస్ 24 మార్చి సామల రామకృష్ణ నేలకొండపల్లి మండల రిపోర్టర్. ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న నేలకొండపల్లిలో బస్టాండ్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిలువు నీడ లేక రోడ్లపై ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ప్రయాణికులు రోడ్లపై పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. అందరూ అభివృద్ధి ప్రదాతలు అని చెప్పుకోవడం తప్ప సామాన్య ప్రజల బస్టాండ్ కష్టాలు తీర్చే వారే లేరు. మండు వేసవిలో మహిళలు చిన్నపిల్లలతో బస్సులు ఆటోల కోసం రోడ్లపై నిలబడాల్సిన పరిస్థితి దాపురించింది. బస్టాండ్ కాకపోయినా కనీసం బస్సు షెల్టర్ అయినా నిర్మించాలని నేలకొండపల్లి మండల ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *