పెద్దకడుబూరులో 10వ తరగతి పరీక్షలపై తహసీల్దార్ ఆకస్మిక తనిఖీ

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 24 రిపోర్టర్ అభి పెద్దకడుబూరు మండలంలో జరుగుతున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను తహసీల్దార్ గీతా ప్రియదర్శిని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు మోడల్ స్కూల్ పరీక్ష కేంద్రాలను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థుల హాజరు, పరీక్షల నిర్వహణ విధానం, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించిన తహసీల్దార్, సంబంధిత అధికారులతో మాట్లాడారు. అనంతరం హెచ్ఎంలు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్లకు అవసరమైన సూచనలు అందజేశారు. పరీక్షలు ఎటువంటి అవాంతరాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఆమె ఆదేశించారు. విద్యార్థులకు సౌకర్యవంతమైన వాతావరణంలో పరీక్షలు జరగేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.