పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం వహించరాదు.

*మండల ఎంపీడీవో శ్రీనివాస్. *పిల్లలతో కలిసి భోజనం చేస్తున్న ఎంపీడీవో శ్రీనివాస్.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 24సాలూర :పిల్లలు,గర్భిణీలు,బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం వహించరాదని మండల ఎంపీడీవో శ్రీనివాస్ అంగన్వాడి నిర్వాహకులను ఆదేశించారు.సోమవారం ఎంపీడీవో సాలూర మండల కేంద్రంలోని అర్జన్ వాడ అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.పిల్లలకు అందించే భోజనాన్ని పరిశీలించారు.రికార్డులు మరియు రిజిస్టర్ ను తనిఖీ చేశారు.పిల్లలు మరియు అంగన్వాడీ నిర్వాహకులతో కలిసి ఎంపీడీవో భోజనం చేశారు.సౌకర్యాలు సక్రమంగా ఉండడంతో ఎంపీడీవో సంతృప్తి వ్యక్తం చేశారు.గ్రామంలోని ప్రతి గర్భిణీ మరియు బాలింతలకు తప్పనిసరిగా ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారాన్ని ఇవ్వాలని తెలిపారు.ఎలాంటి ఫిర్యాదులు వచ్చిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సత్య గంగామణి ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *