పయనించే సూర్యుడు మార్చి 24 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఎస్ ఎస్ పి యు పి పాఠశాలను సిజ్ చేయాలని పిఆర్ఎస్ వై ఎఫ్ ప్రగతిశీల రెవల్యూషనరీ స్టూడెంట్ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిఆర్ఎస్ వై ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా గూడూరుమండలం కె నాగలాపురం గ్రామంలో ఉన్న నాటువంటి ఎస్ ఎస్ పి యు పి పాఠశాల దాదాపుగా 20 సంవత్సరాలనుండి నిర్వహిస్తూ ఉన్నారు అప్పటినుండి సరైన బిల్డింగ్ లేక రేకుల షెడ్డులో స్కూల్ ని కొనసాగిస్తున్నారు అన్ని ఎస్ ఎస్ పి యు పి పాఠశాలలో కనీసం పి ఈ టి టీచర్ లేకపోవడం సిగ్గుచేటు అని ఆ పాఠశాలకి పాఠశాలకు సరైన గ్రౌండ్ లేక విద్యార్థులు క్రీడాలకు దూరంగా ఉంటు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు అన్ని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటువంటి పుస్తకాలే విద్యార్థులు చదవలేకపోతుంటే ఈ పాఠశాలలో అదనంగా నవోదయ కోచింగ్ సెంటర్ ను కూడా నిర్వహించి విద్యార్థులనుమానసిక శోభకు గురి చేయడం తగదని వారు హెచ్చరించారు మరియుఆ పాఠశాలలో 7 వ తరగతి వరకు అనుమతులు ఉంటే స్కూల్ యాజమాన్యం మాత్రం 10 వ తరగతి వరకు స్కూల్ ని నిర్వహించడం జరుగుతుంది అని మండిపడ్డారు,10 వ తరగతికి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని ఇవే కాకుండా ఆ పాఠశాలలో మౌలిక వసతులకు సంబంధించి, విద్యార్థులకు మరుగుదొడ్లు లు లేక విద్యార్థులుబయటికి వెళుతున్నారు అని తెలిపారు, అలాంటి సమయంలో విద్యార్థులకు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అని వారు ప్రశ్నించారు, ఇన్ని సమస్యలు ఉన్నా ఈ పాఠశాలను గూడూరు ఎంఈఓ చర్యలు తీసుకోకుండా తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తూ అటు విద్యార్థుల తల్లిదండ్రులను ఇటు విద్యాశాఖ అధికారులను మోసం చేస్తున్నారని వారు ఆరోపించారు ఇకనై జిల్లా విద్యాశాఖ అధికారుల ఎస్ ఎస్ పి యు పి పాఠశాలపై విచారణ జరిపి పాఠశాలనుసిజ్ చేసి ఎంఈఓ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమాలకు పూనుకుంటామని వారు హెచ్చరించారు.