పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 24, తల్లాడ రిపోర్టర్ ఖమ్మంజిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన ఇస్నపల్లి మహేష్(24) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ముత్తగూడెం వద్ద ఒక్కసారిగా కుక్క రావడంతో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం నుండి కిందపడి పోవడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. తల ముందు భాగం కంటిపైన, వెనుక తల పగిలి పోవడంతో మెదడులోకి రక్తం చేరి ప్లాట్ కావడం జరిగింది. నిరుపేద కుటుంబం కావడంతో ఆ యువకుడుని ఖమ్మం మమత ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే సుమారు లక్ష రూపాయలకు పైగా అప్పులు తీసుకొచ్చి వైద్య సేవలు అందిస్తున్నారు. తండ్రి ఇటీవల మరణించడంతో తల్లి మాత్రమే కుమారుడి బాగోగులు, వైద్య ఖర్చులు అప్పులు తీసుకొచ్చి పెడుతుంది. ప్రమాదం జరిగి మూడు రోజులు కావస్తున్న నేటికీ కూడా యువకుడులో చలనం లేకుండా పోయింది. రోజుకి వేలాది రూపాయలు వైద్య ఖర్చులు అవుతున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని ఆ నిరుపేద కుటుంబానికి అండగా ఉండాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో ఆ తల్లి రోధిస్తున్న తీరు వర్ణనాతీతంగా ఉంది. మెరుగైన వైద్యం అందిస్తే యువకుడు కోలుకునే అవకాశం ఉందని డాక్టర్లు తెలియజేశారు. సహృదయం కలిగిన దాతలు, స్నేహితులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఆ యువకుడు ప్రాణాలు కాపాడి నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ తల్లి వేడుకుంటుంది. సాయం చేయాల్సిన దాతలు 98660 29654, 9908460315 నెంబర్లకు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి ఆదుకోవాలని తల్లి యశోద విజ్ఞప్తి చేస్తోంది.