బాధ్యత మరిస్తే కఠిన చర్యలు

పయనించే సూర్యుడు 24 మార్చి2026 చిన్నంబావి మండలం వనపర్తి జిల్లా బెక్కెం గ్రామంలో కొందరు ప్రభుత్వ పాఠశాలలో అంగన్వాడీ.కేంద్రాలలో మద్యం సేవించి మలమూత్ర విసర్జన చేసి సీసాలు పగలగొట్టి వెళుతున్నారని ప్రభుత్వ పాఠశాలలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం చట్టపరమైన నేరమైనప్పటికీని కొందరు ఇలా గ్రామపంచాయతీలో మద్యం సేవిస్తే ఉపేక్షించే పరిస్థితి లేదని గ్రామ సర్పంచ్ కమలాబాయి ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగాఆమె మాట్లాడుతూ ఇంక మీదట ఎవరైనా బహిరంగ ప్రదేశాలలో ప్రభుత్వ పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాల్లో గ్రామపంచాయతీ పవనాల్లో దేవాలయాల్లో మద్యం సేవించినట్లు తెలిస్తే పోలీసు వారికి తెలియజేస్తామని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతామని అలాగే గ్రామ పంచాయతీ తరుపున పదివేల రూపాయల జరిమానా విధిస్తామని తెలిపారు.మద్యం సేవిస్తున్నప్పుడు గ్రామ సర్పంచ్ కు సమాచారం ఇవ్వాలని గ్రామ ప్రజలని సర్పంచ్ కోరారు ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తులని అట్టి ఆస్తులను కాపాడుకోవడం మన బాధ్యతని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *