పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 24 బోధన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బిజెపి నాయకులు నిజామాబాద్ కలెక్టర్ రేట్ ముట్టడికి పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో బోధన్ రూరల్ పోలీసులు బోధన్ సాలుర మండలల అధ్యక్షులు సిర్ప సుదర్శన్ ,రావుబా గంగాధర్ లను సోమవారం ముందస్తు అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో కాలయాపన చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తుందని ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చమంటే అరెస్టులు చేయడం సరికాదని అన్నారు.అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు.