బీసీ సబ్ ప్లాన్ అమలుకు శేర్లింగంపల్లిలో టిఆర్పి భారీ ధర్నా

పయనించే సూర్యుడు, మార్చి 24 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు,రంగా రెడ్డి జిల్లా అధ్యక్షులు బండారి రమేష్ యాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలోశేర్లిం గంపల్లి నియోజక వర్గంలో భారీగా ధర్నా నిర్వ హించా రు.బీసీ సబ్ ప్లాన్‌ను తక్షణ మే అమలు చేయాలి,కామారెడ్డి డిక్లరే షన్‌ను వెంటనే అమలుపరచాలి అనే డిమాండ్లతో అల్వి న్ ఎక్స్ రోడ్ వద్ద ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడు తూ,ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హా మీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని విమర్శించారు.ప్రతి సంవత్స రం ₹20,000 కోట్లు కేటాయిస్తా మని చెప్పి,కేవలం ₹12,511 కోట్లు మా త్రమే కేటాయించడం బీసీలను మోసం చేయడ మేనని మండిపడ్డారు.బీసీల హక్కుల కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాటం కొనసాగుతుందని,ప్రభు త్వం వెంటనే స్పందించి సబ్ ప్లాన్ అమలు చేయకపోతేఉద్యమాన్ని మరింత ఉధృ తం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్ర మంలో పాల్గొన్న ముఖ్య నాయకు లు:రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బండారు రమేష్ యాదవ్,సీనియర్ నాయకులు పటేల్ కృష్ణ,జిల్లా మహిళా అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్,మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గుల్ల వాసుకి,ఉపా ధ్యక్షులు పొను‌గోటి సందీప్,అధికార ప్రతినిధి శంకరొళ్ల సురేష్ ముదిరాజ్తది తరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయ వంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *