బురెడ్డిపల్లిలో మున్సిపల్ అధికారుల పర్యటన: పన్నుల చెల్లింపుపై అవగాహన

★ సకాలంలో పన్నులు చెల్లించాలని విజ్ఞప్తి ★ జడ్చర్ల మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించండి_ అధికారుల పిలుపు

పయనించే సూర్యుడు, మార్చి 24 మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు సోమవారం బురెడ్డిపల్లి గ్రామంలో పన్నుల వసూలుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను (ఇంటి పన్ను), కొళాయి బిల్లులను ప్రజలు సకాలంలో చెల్లించాలని అధికారులు కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ మేనేజర్ లక్ష్మన్న మాట్లాడుతూ.. ప్రజలు స్వచ్ఛందంగా పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్.ఐ) శంకర్, వార్డ్ ఆఫీసర్, బిల్ కలెక్టర్లు మణిదీప్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.