మళ్లీ మొదటికొచ్చిన షర్మిళ వ్యవహారంషర్మిళ వైఖరితో క్షోభిస్తున్న వైఎస్ ఆత్మ..

పయనించే సూర్యుడు మార్చి 24, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) రాజకీయ ఉనికి కోసం పిసిసి అధ్యక్షురాలు షర్మిళ ప్రత్యర్ధుల చేతిలో కీలు బొమ్మ అవతారం ఎత్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ఎద్దేవా చేసారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలోని అంతర్గత వ్యవహారానికి సంబంధించిన లేఖ తెలుగుదేశం పార్టీకి చెందిన ఐటిడిపిలో ముందుగా ప్రత్యక్షమవడాన్ని చూస్తుంటే షర్మిళ తన రాజకీయ అవసరాల కోసం కుటుంబాన్ని బజారున పడేసారన్నది స్పష్టం అవుతుందన్నారు. రాజకీయాల్లో మాట తప్పని నైజం ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన బాటలో కుమారుడు జగన్మోహన్ రెడ్డి పయనిస్తుంటే అదే కుటుంబం నుంచి వచ్చిన షర్మిళ మాత్రం దిగజారుడు రాజకీయాలు చేయడం బాధకరమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ కుటుంబానికి ఉన్న ఛరిష్మాను, పరువును షర్మిళ మంటగలిపారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఒర్వలేక ఇదంతా చేస్తున్నట్టయితే ఇప్పటికైనా షర్మిళ వాస్తవాలను గ్రహించాలన్నారు. ప్రత్యర్ధులతో కలిసి కుట్రపూరితంగా పెట్టిన కేసుల్లో బెయిల్ రద్దు ప్రయత్నాలు చేయడం సరికాదాన్నారు. తమ పార్టీ అధినేత జగన్ ను నేరుగా ఢీకొట్టలేని కూటమి ప్రభుత్వం మహిళలను అడ్డం పెట్టుకుని కుటుంబాల జోలికి వెళ్లడంపై నాగమణి ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని భారతమ్మను లక్ష్యంగా చేసుకుని జనసేన మహిళ కార్యకర్త సుభాషిణీ అసభ్య పదజాలంతో దూషించడం సరికాదన్నారు. సభ్యత సంస్కారం లేకుండా ఓ మాజీ ముఖ్యమంత్రి భార్యను దూషించినా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం ఏంటి ప్రశ్నించారు. దీనిబట్టీ కావాలనే పవన్ కళ్యాణ్ సదరు జనసేన వీర మహిళలతో అలా మాట్లాడించారా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు.. మరో వైపు అంకెల గారడీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రాపకం కోసం సామాన్యుల ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపాదిత వ్యయానికి రాబడి మధ్య 10, 500 కోట్ల రూపాయిల వ్యత్యాసం ఉందని కాగ్ తన నివేదికల్లో స్పష్టం చేస్తున్నాబాబు గారి అంకెల గారడీ మాత్రం ఆగడం లేదన్నారు. పాఠశాలలో విద్యార్ధుల లేకుండా ఉపాధ్యాయుల నియామకాల చేపట్టి ఏం లాభమని ప్రశ్నించారు. అవసరాన్ని బట్టీ కాకుండా తమ జేబులు నింపుకునేందుకు ఉపాధ్యాయుల నియామాలకు చేపట్టారా అన్న అనుమానం వ్యక్తం చేసారు నాగమణి.