మాజీని అరెస్ట్ చేశారు సరే, తాజా ప్రజాప్రతినిధి సంగతేంటి?

పయనించే సూర్యుడు మార్చి 24 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం జిల్లా రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయ్ నగర్లో ప్రభుత్వ భూములను ప్లాట్లుగా విభజించి అమ్ముకుని కోట్లకు పడగలెత్తిన మాజీ ప్రజా ప్రతినిధిపై కోయచలక రెవెన్యూ పరిధిలోని 192 సర్వే నెంబర్లో 794 నెంబరుగల 75 గజాల స్థలాన్ని 3,10.000 రూపాయలకు ఖమ్మం నగరానికి చెందిన సాల్మన్ రాజ్ అనే వ్యక్తికి విక్రయించి సదరు మాజీ ప్రజాప్రతినిధి తన సంతకాలతో 2024 వ సంవత్సరంలో అగ్రిమెంట్ వ్రాసిఇచ్చి,నెల రోజుల్లో ఒరిజినల్ డాక్యుమెంట్ ఇస్తానని చెప్పడం జరిగింది,కానీ అగ్రిమెంట్ ఇచ్చి సంవత్సరం దాటినప్పటికీ ఒరిజినల్ డాక్యుమెంట్ గురించి పలుమార్లు సదరు ప్రజా ప్రతినిధిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో విసుగు చెంది,తాను మోసపోయానని గ్రహించి సాల్మన్ రాజ్ నాలుగు రోజుల క్రితం రఘునాథపాలెం పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసిన పోలీసులు మాజీ ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన సంగతి విదితమే దినసరి కూలీల నుండి విలాసవంతమైన భవనాలు,లగ్జరీ కార్లదాకా ఇది ఇలా ఉంటే మాజీ ప్రజా ప్రతినిధిని అరెస్ట్ అయితే చేశారుగానీ ఈ అక్రమ ప్లాట్ల దందాలో కీలకంగా వ్యవహరించిన తాజా ప్రజా ప్రతినిధి వైపు పోలీసులు దృష్టి సారించక పోవడం పలు అనుమానాలకు తావిస్తుంది,నిజానికి గత పది,పదిహేను సంవత్సరాలుగా తాజా,మాజీలు ఇద్దరు కలిసి 192 సర్వే నెంబర్లో ప్లాట్ల దందాకు తెర లేపారు,బయటకు శత్రువులుగా నటిస్తూ అంతర్గతంగా స్నేహాన్ని మెయింటెయిన్ చేస్తూ పేద వర్గాల వారిని మోసం చేస్తూ వందల కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు,పొట్ట చేతబట్టుకుని సెంట్రింగ్ మేస్త్రిగా ఒకరు,తాయత్తులు కడుతూ ఒకరు పువ్వాడ నగర్లో జీవితాన్ని ప్రారంభించిన తాజా,మాజీలు అనతి కాలంలోనే విలాసవంతమైన భవనాలు,లగ్జరీ కారుల్లో తిరిగే స్థాయికి ఎదిగారంటే వీళ్లు ఎంతగా ప్రజలను మోసం చేశారనే విషయం తెలుస్తుంది అక్రమాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులా!? అంతే కాకుండా తాజా ప్రజా ప్రతినిధి తన కొడుకు, బావమర్ధులను అడ్డం పెట్టుకుని వందల ప్లాట్లు అమ్ముకున్నట్లు స్థానికులు చెబుతున్నారు,సర్వే నంబర్ 192 లో తమ్మిశెట్టి యాలధ్రి,తన్నిశెట్టి నరసింహారావు అనే వ్యక్తుల దగ్గర నుండి దాదాపు రెండున్నర ఎకరాల ఎస్సైండ్ భూమిని తన బామ్మర్ది షేక్ ఇస్మాయిల్ ఖాన్ పేరు మీద కొనుగోలు చేసి ప్లాట్లుగా విభజించి అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లు ఆధారాలు లభించాయి, అదే విధంగా పువ్వాడ ఉదయ్ నగర్ రోడ్ నెంబర్ వన్ లో 2127, 2128,2137,2138 నెంబరుగల ప్లాట్లను వి.వి.ఎస్.చంద్ర కుమార్ నాయక్, కొర్ర దినేష్ కుమార్ నాయక్ లకు తాజా,మాజీలు ఇద్దరు కలిసి పది లక్షల రూపాయలకు అమ్మినట్లు వాటి తాలూకు అగ్రిమెంట్లు “జనం ముచ్చట”కు లభించాయి, వీటితో పాటు తాజా ప్రజాప్రతినిధి కుమారుడు సైతం వందల ప్లాట్లు అమ్మినినట్లు స్థానికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు, అంతే కాకుండా సదరు ప్రజా ప్రతినిధి కుమారుడు పంచాయతీ సెక్రటరీని అడ్డం పెట్టుకొని అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడని, సొంతంగా ఒక ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని వీరి అక్రమాలను, ఆగడాలను ప్రశ్నించిన వాళ్లపై బెదిరింపులకు దిగడం,భౌతిక దాడులకు పాల్పడటం నిత్యకృత్యంగా మారిందని స్థానికులు వాపోతున్నారు అక్రమార్కులకు అండగా ఉన్న మంత్రి అనుచరులెవరూ!? ఇంత జరుగుతున్న తాజా ప్రజాప్రతినిధి,తన కుమారుడు, బంధువులు తమ అక్రమ ప్లాట్ల దందాను కొనసాగిస్తూనే ఉన్నారని, అయినప్పటికీ ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని, పంచాయతీ పరిధిలో జరిగే అక్రమాలను ప్రశ్నించాల్సిన పంచాయతీ కార్యదర్శి సర్పంచుకు “పీఏ” లాగా వ్యవహరిస్తున్నాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు,కలిసి చేసిన పాపం కలిసే అనుభవించాలి గాని మాజీ ప్రతినిధిని ఒక్కడినే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారుగాని పది, పదిహేను సంవత్సరాలుగా అవిభాజ్య కవలలాగా కలిసి మెలిసి చేసిన ప్రతి అక్రమంలో సగం భాగస్వామ్యం ఉన్న తాజా ప్రజాప్రతినిధిపై మాత్రం పోలీసులు ఈగ వాలనివ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి,ఈ మొత్తం వ్యవహారంలో తాజా ప్రజా ప్రతినిధిని కాపాడటం కోసం రఘునాథపాలెం మండలానికి చెందిన ఓ జిల్లా మంత్రి ప్రధాన అనుచరులు రంగంలోకి దిగి,ఎలాంటి అరెస్టు జరగకుండా పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్ల తెలియవచ్చింది