మాత శిశు ఆరోగ్య కేంద్రం లో సహజ ప్రసవాలు సంఖ్యను పెంచుతూ గర్భవతులకు మెరుగైన సేవలు అందించాలని హాస్పిటల్ యాజమాన్యాన్ని జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆదేశలు జరిచేసారు

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ మార్చ్ 24గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా సోమవారం గజ్వేల్ పట్టణంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి గర్భిణీ స్త్రీలకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వం నిరుపేద గర్భిణీ స్త్రీలకు మంచి వైద్యం అందించడం కోసం ఆసుపత్రి భవనం తో పాటు అన్ని రకాల సదుపాయాలను కల్పించిందని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోనీ డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ సిబ్బంది ప్రతి ఒక్కరు గర్భిణీలకు ఓపికగా వైద్యం చెయ్యాలని ఆదేశించారు. ఆసుపత్రి లోపల అన్ని వార్డులు కలియ తిరిగారు. అప్పుడే పుట్టిన పిల్లలకు టీకా లను సక్రమంగా అందించాలని వార్డులలో గర్భిణీ స్త్రీ, పుట్టిన బిడ్డలకు మంచి వైద్యం అందించాలని ఆదేశించారు. గర్భిణీ స్త్రీలలో మనో ధైర్యం నింపుతూ మంచి ఆహారపు నియమాలు, సహజ ప్రసవాలు జరిగేలా యోగ లాంటి కొన్ని యాక్టివిటీస్ తెలుపాలని డాక్టర్ లకు సూచించారు. సహజ ప్రసవాలు పెంచాలని తప్పనిసరి పరిస్థితి లో మాత్రమే ఆపరేషన్ చెయ్యాలని తెలిపారు. ఆసుపత్రిలో కొంత మంది డాక్టర్లు ఇతర సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నట్లు నా దృష్టికి వచ్చిందని వారి పనితీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేస్తూ డాక్టర్ నుండి కింది స్థాయి సిబ్బంది వరకు పై అధికారి అనుమతి లేనిదే సెలవు తీసుకోవద్దని తప్పనిసరిగా ఆసుపత్రిలో లీవ్ లెటర్ పెట్టాలని తెలిపారు.