ముస్లిం నాయకుల, మత పెద్దల సౌజన్యంతో

★ రంజాన్ శుభాకాంక్షలతో అభిమాన నాయకులకు ఘన సన్మానం ★ సిలార్ పాషా గృహంలో అతిథులు, ప్రతినిధులకు ఘన సన్మానం

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 24,తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో పవిత్ర రంజాన్ సందర్భంగా ఆ గ్రామ ముస్లిం నాయకులు,మత పెద్దలు తమ అభిమాన నాయకులను వారి గృహాలకు ఆత్మీయ ఆహ్వానం పలికి సాంప్రదాయ,ఆచార పానీయాలు ( సీమియాలు) అందజేసి వారి ద్వారా ఆశీర్వాదం తీసుకున్నారు . అనంతరం వారికి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. రంజాన్ పర్వ దినాన్ని పురస్కరించుకొని తమ గృహాలకు విచ్చేసిన తమ అభిమాన నాయకుడు నిరంతర ప్రజా శ్రామికుడు.తన జీవితాన్ని రాజకీయానికి అంకితం చేసి,తన 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో స్వతంత్రంగానూ, అధికారికంగానూ ప్రజలకు చేయూతనందించి ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేస్తూ ఇటీవల ఎంపీపీగా పదవి విరమణ పొందిన తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావుకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా జరిగిన అన్నారుగూడెం పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన పంచాయతీ సర్పంచ్ గా గొడ్ల ప్రభాకర్,ఉప సర్పంచ్ గా కొమ్మినేని వెంకటేశ్వరరావులను శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. అనంతరం కాలనీ ముఖ్యులు మాట్లాడుతూ మీ రాజకీయ జీవితం అంచెలంచెలగా ఎదగాలని,ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీ యొక్క పరిపాలన దక్షత మరియు పని తీరు ఉన్నతంగా ఉండాలని,ప్రజల్లో ప్రజాక్షేత్రంలోనే మీ ప్రయాణం కొనసాగాలని ఈ సందర్భంగా వారు సర్పంచ్ ఉప సర్పంచ్ లను కోరారు. అదేవిధంగా స్థానికంగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి దొడ్డ చిన్న శ్రీనివాసరావును మరియు వారి మిత్రబృందాన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, అన్నారుగూడెం సర్పంచ్ గొడ్ల ప్రభాకర్, ఉపసర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వర్లు, నాయకులు దొడ్డ చిన్న శ్రీనివాసరావు,యువ నాయకులు గోవిందు నరేష్,తుమ్మలపల్లి వెంకటేశ్వరరావు, స్థానికులు మాజీ వార్డు మెంబర్ లు షేక్ లాల్ బిగ్,హుస్సేన్ బేగ్, మైనారిటీ నాయకులు సిలార్ పాషా,నాగు నరసింహారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.