రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ఘనంగా “దొమ్మేటి” జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు మార్చి 24, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో సోమవారం శెట్టిబలిజల దైవం దివంగత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.. తెలుగుదేశం పార్టీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యాలయ ఇన్‌చార్జ్ మేకా లక్ష్మణమూర్తి పాల్గొని దొమ్మేటి వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నులుకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దొమ్మేటి వెంకటరెడ్డి శెట్టిబలిజ సంక్షేమ సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజంలో ప్రత్యేక స్థానం సంపాదించారని కొనియాడారు. శెట్టిబలిజలలో చైతన్యం కలిగించి, వారి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడిన మహనీయుడిగా ఆయనను అభివర్ణించారు.దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరుపుకుంటున్నామని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన యువగళం పాదయాత్ర సమయంలో దొమ్మేటి వెంకటరెడ్డి గొప్పతనాన్ని తెలుసుకుని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు. ఈ రోజు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు కార్యాలయంలో దొమ్మేటి వెంకటేశ్వర వెంకటరెడ్డి జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగిందని,శెట్టిబలిజలకు పండుగ రోజు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దమ్ము నూకరాజు, నారాయణ, దుర్గాప్రసాద్, గింజల శ్రీనివాస్ , నీలకంఠం తదితరులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.