రామకృష్ణ కళాశాలలో భగత్ సింగ్ వర్ధంతివ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహణ

పయనించే సూర్యుడు,కోరుట్ల మార్చి 24 జగిత్యాల జిల్లా నెహ్రూ యువ కేంద్రం, మేరా యువ భారత్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా కోరుట్ల రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాలలో సాహితీ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఆయన దేశభక్తి, ధైర్యం, త్యాగస్ఫూర్తి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం చిన్న వయస్సులోనే ప్రాణాలు అర్పించిన మహానీయుడని కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో స్వచ్ఛతపై అవగాహన పెంచేందుకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా నిర్వహించారు. కళాశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛ భారత్ ర్యాలీ నిర్వహించి పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు.ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం జగిత్యాల జిల్లా నిర్వాహకులు భూమేష్, గణేష్, రామకృష్ణ డిగ్రీ కళాశాల డైరెక్టర్ హరిప్రియ, వైస్ ప్రిన్సిపల్ రాజ్ కుమార్, అధ్యాపకులు అంజయ్య, గౌడ్, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *