రామగిరి లో బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్

* అరెస్టులతో బిజెపి ఉద్యమాన్ని ఆపలేరు: మండల అధ్యక్షుడు కొండు లక్ష్మణ్

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినరీ కాలనీ -24 తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరిస్తున్న తరుణంలో సోమవారం తెలంగాణ అసెంబ్లీ భవన్ ముట్టడికి పిలుపునివ్వగా రామగిరి మండల పోలీసులు మండల బిజెపి శ్రేణులను సోమవారం ఉదయం ముందస్తు అక్రమ అరెస్టు చేయడం చేశారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కొండు లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలను ఇలా అక్రమ అరెస్టులు చేస్తూ ప్రతిపక్షాలను అనగదొక్క ప్రయత్నం చేయడమేంటని,కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నెరవేర్చే వరకు బిజెపి పార్టీ ఉద్యమిస్తూనే ఉంటుందని, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇలాంటి చర్యలు మానుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి సాధించాలని లేనిపక్షంలో రాష్ట్రంలోనీ అన్ని మండలాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.అరెస్ట్ అయిన వారిలో మండల అధ్యక్షుడు కొండు లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి తోట్ల రాజు, ఉపాధ్యక్షుడు నాంసాని మహేష్, పట్టణ అధ్యక్షుడు చిదురాల శివ, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు మైదం సందీప్, కార్యదర్శి కొత్త కమలాకర్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *