రామాలయంలో కుంబాబిషేకం

కుంబాబిషేకం చేస్తున్న దండి స్వామి

పయనించే సూర్యుడు, కోరుట్ల మార్చి 24 జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ సీతారామాలయం లో సోమవారం కాశి 1008 పీఠాధిపతుల అధిపతి కాశి దండి స్వామి ఆధ్వర్యంలో రామాలయ శిఖరం కు 1256 కలశములతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా దండి స్వామి మాట్లాడుతూ 12 సంవత్సరాల కొకసారి చేసే అభిషేకం అని, అభిషేకం లో పాల్గొన్న , అభిషేకం తయారు చేసిన వారికి, పాల్గొన్న వారికి స్వామి వారి దీవెనలు ఉంటాయన్నారు. కోరుట్ల పట్టణంలో సీతారాముల ఆలయం చాలా విశిష్టమైనది అందరూ రోజు దర్శనం చేసుకుంటే ఇక్కడ వైబ్రేషన్ బాగుందని ప్రతి వ్యక్తి గుడికి వెళ్ళి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు వనరడుపుల మురళి, కార్యవర్గం సభ్యులు అడువాల ప్రభాకర్, పైకారి రవీందర్, గడ్డం రాజేంద్ర ప్రసాద్, కట్కం సునీల్, పేడిమల్ల రాజు, ముక్క దాము, భీమనాతి రవి, సంకోజి లక్ష్మీనారాయణ చారి, ప్రవీణ్, మహిళ భక్తులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *