రాయపల్లిలో ముమ్మరంగా సీసీ రోడ్డు పనులు

★ డీకే అరుణ ప్రత్యేక నిధులతో ప్రారంభమైన అభివృద్ధి కార్యక్రమాలు ★ పర్యవేక్షణలో గ్రామ సర్పంచ్ కిష్టారం గాయత్రి మల్లేష్ గౌడ్, ఉప సర్పంచ్ పాలెం ప్రవీణ్ గౌడ్ , వార్డు మెంబర్లు

పయనించే సూర్యుడు, మార్చి 24 మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: రాజాపూర్ మండల పరిధిలోని రాయపల్లి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు రెండో రోజూ అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు డీకే అరుణమ్మ ప్రత్యేక నిధులతో చేపట్టిన రోడ్డు పనులను సర్పంచ్ కిష్టారం గాయత్రి మల్లేష్ గౌడ్, ఉప సర్పంచ్ పాలెం ప్రవీణ్ గౌడ్ద, వార్డు మెంబర్లు నరిగె శ్రీనివాసులు, పాలెం శివ ప్రసాద్ గౌడ్, ఇక్కి మల్లేష్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, నాణ్యతతో కూడిన రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. నిధులు మంజూరు చేసిన డీకే అరుణమ్మకు గ్రామస్తులు ,పెద్దలు అల్లపురం వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అల్లపురం వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ పాలెం ప్రవీణ్ గౌడ్, వార్డు సభ్యులతో పాటు , నరిగె రామచంద్రయ్య, హంస , శివ లింగం, హరీష్, తదితరులు పాల్గొన్నారు.