పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 24 మందమర్రి మండల రిపోర్టర్ బొద్దుల భూమయ్య కరీంనగర్ వసుధ కన్వెన్షన్ లో నిర్వహించిన ఎన్నికల సమ్మేళనంలో లయన్స్ ఇంటర్నేషనల్ 320 జి జిల్లా గవర్నర్ గా లయన్ మోర బద్రేశం జిల్లా ప్రథమ ఉప గవర్నర్ గా లయన్ గుంటుక చంద్రప్రకాష్ జిల్లా రెండవ ఉప గవర్నర్ గా మంచిర్యాలకు చెందిన లయన్ డాక్టర్ ఉదారి చంద్రమోహన్ గౌడ్ ఎన్నికయ్యారు లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320 జి జిల్లా గవర్నర్ గా లయన్స్ క్లబ్ ఆఫ్ చొప్పదండి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న లయన్ మోర బద్రేశం ఎన్నికయ్యారు జిల్లా ప్రథమ ఉప గవర్నర్ గా లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న లయన్ గుంటక చంద్ర ప్రకాష్ ఎన్నికయ్యారు జిల్లా రెండవ ఉప గవర్నర్ గా లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గౌతమి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న లయన్ డాక్టర్ ఉదారి చంద్రమోహన్ గౌడ్ ఎన్నికయ్యారు ఆదివారం నాడు సాయంత్రం కరీంనగర్ లో వసుధ కన్వెన్షన్ లో నిర్వహించిన 320 జి లయన్స్ సమ్మేళనంలో జరిగిన ఎన్నికల్లో కొత్త లీడర్లను ఎన్నుకున్నారు రెండవ ఉప గవర్నర్ కు జిల్లా రెండవ ఉప గవర్నర్ పదవి కోసం హోరా హోరీ పోరు కొనసాగింది మొత్తం 210 ఓట్ల కు గాను 207 ఓట్లు పోలయ్యాయి లయన్ డా ఉదారి చంద్రమోహన్ గౌడ్ కు 107 ఓట్లు రాగా లయన్ ఇనుగుర్తి రమేష్ కు 67 ఓట్లు పోలయ్యాయి లయన్ దుద్దిల్ల నారాయణరావుకు 33 ఓట్లు వచ్చాయి మొదటి రౌండ్ లోనే విజయం ఖాయమైంది లయన్ డాక్టర్ చంద్రమోహన్ గౌడ్ మాట్లాడుతూ ఈ విజయానికి సహకరించిన లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గౌతమి సభ్యులకు మరియు జిల్లా సభ్యులకు చంద్రమోహన్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తు సామాజిక సేవా దృక్పథంతో క్లబ్ అభివృద్ధికి ప్రజాసేవకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు