వార్డు సభ్యులు ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలి.

* మండల ఎంపీడీవో శ్రీనివాస్. * శిక్షణ తరగతులలో మాట్లాడుతున్న ఎంపీడీవో శ్రీనివాస్.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 24 సాలూర : వార్డుకు సంబంధించి ప్రతి అంశంపై వార్డు సభ్యుడు అవగాహన కలిగి ఉండాలని సాలూర మండల ఎంపీడీవో శ్రీనివాస్ సూచించారు.మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం గ్రామాలకు చెందిన వార్డు సభ్యులకు శిక్షణా తరగతులు ప్రారంభించారు. శిక్షణ కలిగి ఉన్న పలు గ్రామాల కార్యదర్శులు శిక్షకులుగా వ్యవహరించి వార్డు సభ్యులకు శిక్షణను ఇచ్చారు.ఈ శిక్షణ తరగతులు 5 రోజుల పాటు చేపట్టనున్నట్లు ఎంపీడీవో వెల్లడించారు. ప్రతి రోజు వార్డు సభ్యులు తప్పనిసరిగా శిక్షణ తరగతులకు హాజరు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సాలూర ఇంచార్జ్ కార్యదర్శి శ్రీనివాస్, శిక్షకులు, గ్రామాలకు చెందిన వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *