పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 24, 2026: గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ మండల పరిధిలోని పుట్ట పాశం గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్లో మద్యం బాటిల్లు,దర్శనము మందు బాబులకు అదొక బార్, వివరాల్లోకి వెళితే గత వైసిపి ప్రభుత్వ హయాంలో, సచివాలయ వ్యవస్థతో అన్ని సేవలు గ్రామాల్లోనే ప్రజలకు సేవలు అందుబాటులో అందాలని ఉద్దేశంతో, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్, రైతు భరోసా, పశువుల హాస్పిటల్ లు భవన నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వo కొన్ని గ్రామాల్లో భవనాలు నిర్మాణం పూర్తి చేశారు. మిగతా గ్రామాల్లో ఒకటి లేదా రెండు భవనాలు నిర్మాణాలు జరిగాయి కొన్ని అసంపూర్తిగా మధ్యలో నిలిచిపోయాయి, అందులో భాగంగా పుట్టపాశం గ్రామంలో యెమ్మిగనూరు టు కర్నూల్ వెళ్లే ప్రధాన రహదారి పక్కనే నిర్మించిన, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ భవన నిర్మాణం పూర్తి చేసి భవనాలపై వైద్యానికి సంబంధించిన చిత్రాలతో అందుంగా రూపుదిద్దుకొంది. భవనాలు ప్రారంభానికి నోచుకోకముందే వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ భవనాలు నిర్మాణం పూర్తయిన వాటిని సంబంధిత శాఖలకు వినియోగించకుండా, అలాగే వదిలేశారు. ప్రజాధనం కోట్ల రూపాయలు వృధా, సంబంధిత శాఖలకు మాత్రం అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నారు. ప్రభుత్వ అధికారులకు వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న, ప్రారంభోత్సవానికి నోచుకోలేక ఎదురుచూస్తున్న భవనాలను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టడానికి గల కారణం ఏమిటి, గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఇల్లు లేని నిరుపేదలకు పట్టణాల్లో డిక్కు గృహాలు, నిర్మాణం చేపట్టారు. లబ్ధిదారులకు ఇవ్వాలని, సమయంలో అప్పటి ప్రభుత్వం అధికారం కోల్పోయింది. తర్వాత వచ్చిన వైసిపి ప్రభుత్వం, ఐదు సంవత్సరాలు కాలయాపన చేసి, లబ్ధిదారులకు ఎవరికి కూడా మంజూరు చేయలేదు, గత ప్రభుత్వం కాలయాపన చేసిన విధంగా, వైసీపీ నిర్మించిన ప్రభుత్వ భవనాలను ప్రారంభించకుండా, ఇప్పటి ప్రభుత్వం అదే తోవలోనే విస్మరిస్తుంది అనుకోవాలా,కనీసం సంబంధిత శాఖకు నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవనాలను ప్రారంభం చేసి ప్రజలకు సేవలు అందించకుండా కాలయాపన చేయడం, సంరక్షణ లేకపోవడం వలన, తలుపులకు ఉన్న చిలుకలు విరగొట్టి, లోపల మందుబాబులు మద్యం సేవిస్తూ వాటిని బార్ గా మలుచుకున్నారు. కొత్త భవనాలు అయి ఉండి సంరక్షణ లేకపోవడంతో అక్కడక్కడ మెట్ల మార్గం శిథిలమైతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు. మధ్యలో అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలను నిర్మాణం చేపట్టకపోవడం, ఉన్న భవనాలను వినియోగించుకోకపోవడం, అద్దె భవనాల్లోనే కొనసాగుతుండడం, గత వైసిపి ప్రభుత్వం, ఇప్పటి అధికార కూటమి ప్రభుత్వ విధానాల వలన కోట్ల రూపాయలు ప్రజా ధనం దుర్వినియోగ పాలు చేసారని, ఇప్పటి కైనా ప్రభుత్వనికి కనువిప్పు కలిగి కళ్లు తెరిచి, నూతన భవనాలను మరుగున పడవేయకుండా ప్రజలకు సేవలు అందించే విధంగా చేసి, సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని నిత్యం ఈ రహదారి గుండె నాయకులు ప్రయనిస్తుంటారు. అసంపూర్తిగా ఉన్న భవనాలు కనపడవా, ఇప్పటికైనా ప్రభుత్వ, ప్రజా ప్రతినిధులు అధికారులు మేలుకోండి ప్రజా ధనం వృధా చేయకండి కళ్ళు తెరవండి, సేవలందించే విధంగా చర్యలు తీసుకోండి అంటూ ప్రజలు కోరారు