షహిద్ భగత్ సింగ్, రాజగురు, సుఖ్ దేవ్ ల 95వ వర్ధంతి.

పురస్కరించుకొని విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఏఐఎఫ్టియు నాయకులు చంద్రగిరి శంకర్.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 24 మందమర్రి మండల ప్రతినిధి బొద్దుల భూమయ్య భూపాలపల్లి జిల్లా డిగ్రీ కాలేజీ సమీపంలో ఉన్న షహిద్ భగత్ సింగ్ విగ్రహాలకుకు పూలమాల వేసి 95వ వర్ధంతి కార్యక్రమము నిర్వహించుకొని వారు చేసిన స్వతంత్ర ఉద్యమ త్యాగాల చరిత్రను స్మరించుకుంటు నివాళులర్పిస్తూ ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్ మాట్లాడుతు షహిద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల అమరత్వాన్ని ఎత్తిపడుతు పల్లె పట్టణ ప్రాంతాల్లో సామ్రాజ్యవాద అధర్మం యుద్దాన్ని వ్యతిరేకిస్తూ సభలు సమావేశలు జరుపుకోవాలని ప్రపంచదేశాలపై ఆధిపత్యం కోసం అమెరికా దేశం ఎగాదోస్తున్న యుద్దాలను ఖండిస్తు అమెరికా,ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ దేశం పై యుద్ధం ప్రపంచశాంతికి విఘాతం కలిగిస్తుందని యుద్ధం వల్ల భారతదేశ ఆర్ధిక వ్యవస్థ సంక్షోభానికి నెట్టు వేయబడుతుందని ఇరాన్ దేశంలో వేలాది మంది అమాయక ప్రజలు తమ ప్రాణాలను కోల్పోవడం జరిగిందని చమురు సంక్షోభం సామాన్య మానవుల ఆహార ఆర్ధిక వ్యవస్థ అతలకుతలం అవుతుందని నిత్యవసర ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నాయని అమెరికా సామ్రాజ్యవాద చర్యలను వ్యతిరేకిస్తు వెంటనే యుద్ధాన్ని నిలిపివేయాలని ప్రపంచ శాంతియుత వాతావరణం నెలకొల్పాలని భారత దేశ విముక్తి కోసం బ్రిటిష్ సామ్రాజవాదానికి వ్యతిరేకంగా యవ్వనప్రాయంలో ఊరికోయ్యాలు ముద్దాడిన భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవ్ ల అశయాల కోసం విద్యార్థి యువత ముందుకు కొనసాగాలని విద్యార్థి యువత వారి ఉన్నంత భవిష్యత్తును కోల్పోవడానికి కారణమైన గంజాయి మందు మత్తు మాదకద్రవ్య పదార్థాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిషేధించాలని యువత భవిష్యత్తు కోసం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రపంచ కార్మిక కర్షక, విద్యార్థి, మేధావులు ఐక్యంగా ఉద్యమించాలని ఏ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకుల చంద్రగిరి శంకర్ పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ జి ఎల్ బి కే ఎస్ నాయకులు శివదర్శన్ మల్లేశం ,శంకర్, రంగయ్య, స్వామి తదితరులు పాల్గొనడం జరిగింది విప్లవ అభినందనలతో శ్రామిక శక్తి గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం ఏ ఐ ఎఫ్ టి యు నాయకులు శివ దర్శన్