షహీద్ భగత్ సింగ్ పోరాట వారసత్వాన్ని కొనసాగించాలి!

మంచిర్యాల లో భగత్ సింగ్ సంస్మరణ సభ

పయనించే సూర్యుడు మార్చ్. 24 మంచిర్యాల్ జిల్లా మంచిర్యాల్ మండల్ రిపోర్టర్ (గొడుగు ఆశీర్ విల్సన్) భరతమాత దాస్య విముక్తి కోసం పోరాడి ఉరికంబాన్ని ముద్దాడిన షహీద్ భగత్ సింగ్ స్ఫూర్తితో దేశ ప్రజలు సమస్యల సాధన కోసం ఉద్యమించాలని వివిధ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. షహీద్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవుల 95 వ అమరత్వ దినం సందర్భంగా సోమవారం రోజున మంచిర్యాలలో ఏర్పాటుచేసిన సంస్మరణ సభలో వారు పాల్గొని ప్రసంగించారు. కుల మత సంకుచిత ధోరణులను అధిగమించిన నాటి వీరులు స్వాతంత్ర్య పోరాటంలో ఐక్యంగా పాల్గొన్నారని వారు తెలిపారు. నేటి కాలంలో ప్రజలు మత సామరస్యతను, జాతి సమైక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు. "సామ్రాజ్యవాద్ ముర్దాబాద్" అంటూ నేటికీ వందేళ్ల క్రితమే షహీద్ భగత్ సింగ్ నినదించాడని వారు తెలిపారు. ఆయా స్వతంత్ర దేశాలలోకి చొరబడి దేశాధినేతలను రాక్షసంగా హతమార్చే జులుంను ప్రదర్శిస్తున్న అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడే వారికి భగత్ సింగ్ స్ఫూర్తిగా నిలిచాడని వారు పేర్కొన్నారు. దేశంలోని సామాన్య ప్రజలకు ఆకలి, పీడనల నుండి విముక్తి లభించడమే నిజమైన స్వాతంత్ర్యమని షహీద్ భగత్ సింగ్ పేర్కొన్నాడని వారు తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలపై పోరాడే వారికి తరగని స్ఫూర్తి ప్రదాతగా షహీద్ భగత్ సింగ్ నిలిచి ఉంటాడని తెలిపారు. భగత్ సింగ్ పుట్టిన గడ్డపై ఆయన ఆశయాలకు మరణం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షహీద్ భగత్ సింగ్ స్మారక సమితి కన్వీనర్ అలుగూరి కైలాసం, సామాజిక న్యాయవేదిక కన్వీనర్ రంగు రాజేశం, బీసీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల మల్లయ్య, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు సంకె రవి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్, బీమా ఉద్యోగుల సంఘం నాయకులు మోతే రామదాసు, ఏ తిరుపతిరెడ్డి, క్యాతం రవి, నేదునూరు కిరణ్, తూముల మల్లేష్, అన్నం రమేష్ కట్టా ప్రకాష్, కుక్కుడపు బాపు, గుమాస ప్రకాష్, వేముల అశోక్, తోట గౌరయ్య, ప్రేమ్ కుమార్, రవూఫ్ మిడివెల్లి రాజ్ కుమార్ పాల్గొన్నారు