షాహిద్ భగత్ సింగ్ ఆశయం కోసం పనిచేస్తాం

* సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి,సెంటినరీ కాలనీ-24 భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా సిఐటియు రామగుండం-3 డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో వారికి నివాళులు హర్పిస్తూ,నినాదాలు చేస్తూ సిఐటియు ఆఫీస్ నుండి మార్కేట్ సెంటర్ జ్యోతి రావు పూలే,అంబేద్కర్ చౌరస్తా నుండి ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా బ్రాంచి కార్యదర్శి దొమ్మటి కొమురయ్య మాట్లాడుతూ..స్వాతంత్ర పోరాటంలో ఎంతో స్పూర్తితో పోరాడి 23 సం.ల వయస్సులో ఉరి కంబాన్ని ముద్దాడిన వ్యక్తి , మతోన్మాదాన్ని వ్యతిరేకించి, ఆరోజే సోషలిజానికై పరితపించి, సామ్రాజ్య వాదాన్నీ వ్యతిరేకించారు.తన సహచరులు రాజు గురు, సుక్ దేవ్ లు కూడా దేశభక్తితో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి దేశం కోసం 23 సం.ల యుక్తవయస్సులో అమరులయ్యారు. సామ్రాజ్య వాదం ఎంత దుర్మార్గమైనదో ఆరోజే భగత్ సింగ్ అంచనవేశాడు. అమెరికా సామ్రాజ్య వాదం ప్రపంచాన్ని వణికిస్తున్న పరిస్తితి స్వతంత్ర దేశాది నేతలను బంధించడం, చంపడం, ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం.దేశాల సంపద బరితెగించి దోసుకోవడం ప్రపంచాన్ని అస్థిరతకు గురిచేయడం ఈ విధానాలను తిప్పికొట్టి దేశాల స్వయం ప్రతిపత్తి,సార్వబౌమాదికారం,స్వయం పాలన కొనసాగాలి మన దేశ పాలకులు అమెరికా సామ్రాజ్య వాదానికి సాగిలపడడం,దేశ ప్రజలను బానిసత్వంలోనికి తీసుకెళ్లి కట్టుబానిసలుగా చేసే విధంగా వ్యవహరించే విధానాలను తిప్పికొట్టి సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు,హమీద్ పాషా, ప్రభాకర్, మహేష్, సత్తయ్య, ఐ.శ్రీనివాస్, రవికుమార్, రాయమల్లు, హబీబ్పాషా, మల్లికార్జున్, ప్రవీణ్, కార్తీక్, రాజనర్సు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *