పయనించే సూర్యుడు : మార్చి 24 జడ్చర్ల తాలూకా బాలనగర్ మండల రిపోర్టర్ రేవల్లి కృష్ణ మేరా యువ భారత్ కేంద్ర ఆధ్వర్యంలో షాహిద్ దివాస్ కార్యక్రమాన్ని బాలానగర్ మండల్ కేంద్రంలో ఏకలవ్య పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా యువజన అధికారి కోట నాయక్ పాల్గొనడం జరిగింది.సుకుదేవ్ , రాజ్ గురు, భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేశారు నివాళి అర్పించడం జరిగింది. దేశ స్వతంత్రం కోసం ప్రాణ త్యాగం చేసిన వారి చేసిన సేవలు గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా యోజన అధికారి కోటా నాయక్ నేషనల్ యూత్ వాలంటరీ ఎస్ రాజేష్ నాయక్ మరియు పాఠశాల ప్రిన్సిపల్ కళాశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.