పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 24 బోధన్ : ప్రభుత్వ శనగ కొనుగోలు కేంద్రాన్ని మార్క్ ఫెడ్, ఎన్సిసిఎఫ్ నేతృత్వంలో హున్సా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సోమవారం శనగ కొనుగోలు కేంద్రాన్ని బోధన్ ఏఎంసీ చైర్మన్ చీల శంకర్,వైస్ చైర్మన్ వసంత్ రెడ్డి, ప్రారంభించారు.క్వింటాలుకు 5875 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించినట్లు సొసైటీ సీఈవో అనిల్ పటేల్ స్పష్టం చేశారు.ఎకరానికి 7 క్వింటాళ్ల 62 కిలోలు శనగ పంటను కొనుగోలు చేయనున్నట్లు సీఈఓ వెల్లడించారు.సిబ్బందికి సహకరిస్తూ సమన్వయంతో రైతులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా శనగ పంటను విక్రయించాలని ఏఎంసీ చైర్మన్ శీల శంకర్ సూచించారు.ఎకరానికి 7 క్వింటాళ్ల 62 కిలోలు పంట కొనుగోలు నిబంధనలు సడలించి రైతు పండించిన మొత్తం పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు నాయకులు మరియు అధికారులను కోరారు.ప్రభుత్వ పెద్దలు మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్తామని రైతులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులు అనధికారులు పార్టీల నాయకులు గ్రామాల సర్పంచులు రైతులు తదితరులు పాల్గొన్నారు.