పయనించే సూర్యుడు 25 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ ఈరోజు 24/03/2026 తేదీన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి అనంతపురం & కర్నూల్ జిల్లాల వరప్రదాయాని ఆర్. డి. టి. సంస్థ యొక్క (ఎఫ్ సి ఆర్ ఏ. ) ను లైసెన్స్ రెన్యూవల్ చేయించుటకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యా & ఐ. టి శాఖ మంత్రి నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆర్ డి టి సంస్థ రాష్ట్రంలో అనాధలకు అనాధ ఆశ్రయాలు, వికలాంగులకు, పరికరాలు, విద్యాలయాలు, పేద మరియు ధనిక అని తేడా లేకుండా అందరికీ వైద్యం అందేలా వైద్యాలయాలు, రైతులకు, డ్రిప్పు ఇరిగేషన్ పరికరాలు మరియు పండ్ల తోటల పెంపకం, క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులను ప్రోత్సహించడం అలాగే క్రీడా మైదానాలు నిర్మించడం, విద్యలో రాణిస్తున్న పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడం ఇలా అనేక సంక్షేమ పథకాలు నిర్వహిస్తున్న ఆర్ డి టి సంస్థ యొక్క(ఎఫ్ సి ఆర్ ఏ. ) ను రెన్యువల్ చేయించిన మన ప్రియతమ నాయకుడు నారా లోకేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నము. శ్రీమతి గుడిసె ఆధి కృష్ణమ్మ కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు