
పయనించేసూర్యుడు న్యూస్ మార్చి 25 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి జిల్లాలో జరుగుతున్న ఓటర్ మ్యాపింగ్ కార్యక్రమం పురోగతిపై జాయింట్ కలెక్టర్ మంగళవారం ఆదోని నియోజకవర్గంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి బూత్ లెవల్ ఆఫీసర్, బి ఎల్ వో, కనీసం 90 శాతం మ్యాపింగ్ లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి చేయాలని ఆదేశించారు.ఆదోని నియోజకవర్గంలో ప్రస్తుతం ఓటర్ మ్యాపింగ్ పురోగతి ఆశించిన స్థాయిలో లేదని, ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అత్యల్ప పురోగతి నమోదవుతున్నదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని అధికారులు సమన్వయంతో పని చేసి లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ ఇంచార్జి అజయ్ కుమార్, తహశీల్దార్ శేషఫణి, డిప్యూటీ తహశీల్దార్ బాబు, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.