ఆలేరు పాఠశాలల్లోమండలవిద్యాధికారి ఆకస్మిక తనిఖీలు.

పాఠశాల రికార్డులు ఆన్‌లైన్ చేయాలని ఆదేశాలు.

పయనించే సూర్యుడు. మార్చి 25. నాగర్ కర్నూల్ జిల్లా. తెల్కపల్లి మండలం రిపోర్టర్ :సుల్తాన్ నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం ఆలేరు ప్రాథమిక ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలల ను మండలవిద్యాధికారి సి. శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించి ఎఫ్ ఎల్ ఎన్. ఎల్ ఐ పి. అమలు ను పరిశీలించారు. ప్రాథమిక పాఠశాలలో ఎఫ్ ఎల్ ఎన్ తుది పరీక్షను పరీక్ష పత్రాలను ప్రగతి రిజిస్టర్లను ,పిటిఎం రిజిస్టర్ లను ,లైబ్రరీ రిజిస్టర్లు, ఎండిఎం నిర్వహణ రిజిస్టర్ లను పరిశీలించి అన్ని ఫలితాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయవలసిందిగా సూచించారు.మూడవ తరగతి ఎఫ్ ఎల్ ఎస్. పరీక్షలు పరిశీలించి సి.గ్రేడ్ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రాథమిక ఉన్నత ఆలేరు పాఠశాలలో.ఎల్ ఐ పి అమలు తుది పరీక్ష పత్రాలను రికార్డులు పరిశీలించి అన్ని ఫలితాలను ఆన్లైన్ చేయవలసిందిగా సూచించారు. రెండు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి వంట ఏజెన్సీ వారితో మాట్లాడి మధ్యాహ్న భోజనానికి సంబంధించి మార్చి 15 వరకు పూర్తి బిల్లును చెల్లించడం జరిగిందని మధ్యాహ్న భోజనాన్ని ఖచ్చితంగా మెనూ ప్రకారం నిర్వహించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *