ఆశ వర్కర్ల నియామకంలో అధికారుల చేతివాటం..

పయనించే సూర్యుడు మార్చి 25, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) మెరిట్లో మార్కులు వచ్చిన తక్కువ మార్కులు వచ్చిన వారికి పట్టం కట్టిన అధికారులు.. ఆశ వర్కర్ గా ఉద్యోగం ఇప్పించి నా కుటుంబాన్ని ఆదుకోండి.. మొర్ర పెట్టుకుంటున్న వాకలపూడి ఫిషింగ్ హార్బర్ కు చెందిన మేడిశెట్టి సాయి లక్ష్మి ఆవేదన.. వాకలపూడి గ్రామం కు చెందిన మేడిశెట్టి వెంకట సాయి లక్ష్మి ఆశా వర్కర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది ఈనెల 25న ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యి మెరిట్ లిస్టులో తన పేరు ఉండి ఉద్యోగం వస్తదని అనుకున్న సమయంలో అన్ని అర్హతలు ఉన్న నన్ను కాదని వాకలపూడి సంతోష్ నగర్కు చెందిన చీకట్లో దుర్గాభవానికి ఉద్యోగం ఇప్పించడం ఎంతవరకు సమంజసం అని కలెక్టర్ ఎమ్మెల్యే పంతం నానాజీ దీనిపై దృష్టి సారించాలని సాయి లక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఫిషింగ్ హార్బర్ కు చెందిన అన్ని అర్హతలు ఉన్నాయని ఫిషింగ్ హార్బర్ కు కాదని రాత్రి వరకు మెరిట్ లిస్టులో పేరు ఉన్న ఉదయానికి కల్లా పేరు మారిపోయిందని అర్హత లేనివారికి ఉద్యోగం ఇస్తే అర్హత ఉన్నవారు ఏం చేయాలని మీడియాకు ద్వారా ఆమె ప్రశ్నించారు. తన భర్త కూలీ పని చేస్తారని ఇద్దరు పిల్లలు ఉన్నారని ఉద్యోగం నాకు ఎంతో ముఖ్యమని నాకు న్యాయం చేయాలని ఆమె కన్నీరుతో వేడుకున్నారు.