ఇళ్ళు కాలిన అగ్ని ప్రమాద బాధితులకు బి ఆర్ ఎస్ నాయకుల భరోసా

★ కొత్త నారవారిగూడెంలో మానవత్వం చాటుకున్న నాయకులు ★ బాధితులకు నిత్యావసరాల పంపిణీ చేసిన మండల బిఆర్ఎస్ నాయకులు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 25 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే చాలు మేమున్నాం అంటూ ముందు వరుసలో ఉంటారు బి ఆర్ ఎస్ నాయకులు అని మరోసారి నిరూపితమైంది అశ్వారావుపేట మండలం కొత్త నారవారిగూడెంలో ఆదివారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన కిన్నెర శ్రీను కిన్నెర అర్జున అనే సోదరుల కుటుంబాలను బి ఆర్ ఎస్ నాయకులు స్వయంగా కలిసి అండగా నిలిచారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇళ్లు సామాన్లు పూర్తిగా దగ్ధమై,నిరాశ్రయులైన వారిని చూసి ధైర్యం చెప్పారు. కేవలం పరామర్శకే పరిమితం కాకుండా ఆ కుటుంబాలు తక్షణమే కోలుకోవాలనే ఉద్దేశంతో వారికి కావాల్సిన బియ్యం, నిత్యావసర సరుకులు మరియు వంట సామాగ్రి, దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎల్లప్పుడూ ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములవుతారని బాధితులకు ప్రభుత్వం నుండి కూడా తగిన సాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. క్లిష్ట సమయంలో తమను ఆదుకోవడానికి తక్షణమే స్పందించిన బి ఆర్ ఎస్ నాయకులపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మాజీ ఎంపీపీ జల్లిపల్లి. శ్రీరామమూర్తి, మండల నాయకులు జూపల్లి. రమణారావు, కాసాని. చంద్రమోహన్,డాక్టర్ భూక్యా. ప్రసాద్, మోటూరి. మోహన్, నారంవారి గూడెం సర్పంచ్ మనుగొండ. నాగమణి, మాజీ సర్పంచ్ మనుగొండ. వెంకట నాగ ముత్యం, వేదాంతపురం మాజీ సర్పంచ్ సోయం. ప్రసాద్ లగడపాటి. మల్లికార్జున రావు, ముక్కయ్య, గోపిన. బుచ్చిబాబు, నారం. పోతురాజు, సీతారాం సింగ్, నారం. మన్మధరావు, వేముల. కొర్రాజులు, నారం. చిన్న వెంకయ్య, నారం. మల్లయ్య, గోపిన. కృష్ణయ్య మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.