కరాటే లో జాతీయస్థాయికి ఎదగాలి సర్పంచ్ బాసు నాయక్

* ప్రతి విద్యార్థి కరాటే నేర్చుకోవాలి ఎల్లారం శేఖర్ రెడ్డి * చింతగట్టు తండా కరాటే విద్యార్థులకు గ్రేడింగ్ టెస్ట్ మరియు బెల్ట్ సర్టిఫికెట్ అందజేత

పయనించే సూర్యుడు మార్చి 25 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని చింతగట్టు తండా కు చెందిన కరాటే విద్యార్థులు ఇటీవలే జరిగిన బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ లో ఉత్తీర్ణత సాధించి పలువురి అభినందనలు పొందారు. కరాటే సీనియర్ మాస్టర్ పీరు నాయక్ ఆధ్వర్యంలో విద్యార్థులు తమ యొక్క కరాటే విన్యాసాలను మెరుగుపరుచుకునే వివిధ కేటగిరిలో బెల్టులను పొందడం జరిగింది. షాద్నగర్ రామకృష్ణ థియేటర్లో జరిగిన ఈ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ లో విద్యార్థులు రాజేష్ రఘు షర్మిల అంకిత మీనాక్షి సుహాసిని హారిక రష్మిక చరణ్ దీక్షిత్ అక్షయ సింధు కరాటే బెల్ట్ తో పాటు సర్టిఫికెట్లను అందుకున్నారు. వీరిని సిద్దాపూర్ సర్పంచ్ విస్లావత్ బాసు నాయక్ మరియు సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఎల్లారం శేఖర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలని మరియు ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. విద్యార్థులకు తమ సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని మాస్టర్ పీరు నాయక్ ప్రత్యేకంగా అభినందించారు. మరియు యాదవ్ బుడోఖాన్ కరాటే క్లబ్ డిప్యూటీ కరాటే గ్రాండ్ మాస్టర్ సాయినాథ్ యాదవ్ సీనియర్ కరాటే మాస్టర్ నరేందర్ నాయక్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *