కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే మా పాలకవర్గం ప్రధాన లక్ష్యం

నగర మేయర్ కొలగాని శ్రీనివాస్

పయనించే సూర్యుడు మార్చి 25 కరీంనగర్ న్యూస్: కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి లో భాగంగా మంగళవారం రోజు నగరంలో పర్యటించారు. మొదటగా 44 వ డివిజన్ సప్తగిరి కాలనీ కస్తూరిభా గాంధీ ప్రభుత్వ పాఠశాలలో స్థానిక కార్పోరేటర్ చాడగొండ కవిత బుచ్చిరెడ్డి తో కలిసి 38 లక్షల నాభార్డ్ నిధులతో సైన్స్ ల్యాబ్ నిర్మాణంకు భూమీ పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం 49 వ డివిజన్ సంతోష్ నగర్ లో కార్పోరేటర్ ఎన్నం లక్ష్మీ ప్రకాష్ తో కలిసి సంతోషిమాత దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సంతోష్ నగర్ కాలనీలో రోడ్డు, డ్రైనేజీ సమస్యలను తనిఖీ చేసి పరిశీలించి… సంతోష్ నగర్ రోడ్డు సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం భాగ్యనగర్ కాలనీలో 15 వ ఆర్థిక సంఘం 4 లక్షల నిధులతో మంచి నీటి సరఫరా పైపులైన్ అభివృద్ధి పనులకు భూమీ పూజ చేసి పనులు ప్రారంభం చేశారు. చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీస్కోవాలని అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంధర్బంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ… ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా పాలకవర్గం పని చేస్తుందన్నారు. శివారు ప్రాంతాల,విలీన గ్రామాల డివిజన్లు ప్రాధాన్యతగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. 66 డివిజన్లలో ప్రజా సమస్యలను దశలవారీగా పరిష్కరించి… వసతి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అధునీకరణ పనులు చెపట్టి విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించామని తెలిపారు. అధునిక విద్యా బోధన అందించే విధంగా పలు ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో స్మార్ట్ ఈ క్లాస్ రూంలు ఏర్పాటు చేశామని తెలిపారు. సప్తగిరి ప్రభుత్వ పాఠశాలలో కూడ విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ము ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కస్తూరిభా గాంధీ పాఠశాల విద్యార్థుల కోసం నాభార్డుకు చెందిన 38 లక్షల నిధులతో సైన్స్ ల్యాబ్ భవన నిర్మాణం పనులకు భూమి పూజ చేసినట్లు తెలిపారు. అంతే కాకుండా 49 వ డివిజన్ భాగ్యనగర్ లో ప్రజలకు త్రాగు నీటి సౌకర్యం కల్పించేందుకు నూతనంగా మంచి నీటి పైపులైన్ అభివృద్ధి పనులను ప్రారంభం చేశామని తెలిపారు. మా పాలకవర్గం లో దశలవారీగా డివిజన్ల లో ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ… నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కార్పోరేటర్లు బండ రమణారెడ్డి, కర్రె పద్మ అనిల్, గాజ రమ శివరాం, డీఈ శ్రీనివాస్, ఏఈలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *