కలెక్టరేట్ ఎదుట టిపిటిఎఫ్ నిరసన

పయనించే సూర్యడు న్యూస్ మార్చ్ 25 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలి. టి పి టి ఎఫ్ ఉపాధ్యాయ ,విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టిపిటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సిద్దిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జి. తిరుపతిరెడ్డి, మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తుందని ,2023 జూలై నుండి రావాల్సిన పిఆర్సిని ప్రకటించడంలో సాచివేత ధోరణి అవలంబిస్తుందని, రిటైర్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా కు మానసిక ఆందోళనకు గురిచేస్తుందన్నారు,వెంటనే బిల్లులు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. రాష్ట్ర కార్యదర్శి రాజయ్య,జిల్లా అధ్యక్షులు విజేందర్ ర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ ఉపాధ్యాయ దర్శిని సంపాదక వర్గ సభ్యులు కనకయ్య, రాష్ట్ర అకాడమిక్ సెల్ కన్వీనర్ ప్రకాష్ గారు మాట్లాడుతూ తెలంగాణ విద్యా కమిషన్ రిపోర్టు ప్రకారం విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయించాలని,పిఆర్సిని వెంటనే ప్రకటించి బడ్జెట్లో నిధులు కేటాయించాలని, రిటైర్డ్ టీచర్ల పెన్షనరీ ప్రయోజనాలను ఏక మొత్తంలో విడుదల చేయాలని, సిపిఎస్ ను రద్దు చేసి,2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ వర్తింపజేయాలని, పెండింగ్లో ఉన్న బిల్లులు,డిఏలు విడుదల చేయాలని, విద్యా రంగంలో కాంట్రాక్టు టీచర్ల వ్యవస్థ విధానాన్ని రద్దుచేసి మినిమం టైం స్కేల్ ఇవ్వాలని, రెగ్యులర్ పద్ధతిలో నియామకాలు చేపట్టాలని, కేజీబీవీ మోడల్ స్కూల్, గిరిజన ఆశ్రమ రెసిడెన్షియల్ స్కూల్ టీచర్లకు నగదు రహిత వైద్య సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో మెమోరాండం సమర్పించారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణ,మల్లేశం, అజీజ్, పాపిరెడ్డి, జిల్లా కార్యదర్శి , రామ్ రెడ్డి,సత్య కృష్ణ, రాములు మహిళా కార్యదర్శిలు మంజుల, వెంకటరమణ రాష్ట్ర కౌన్సిలర్లు రామస్వామి, రాజులు,జానకి రాములు,తిరుపతి జిల్లాలోని మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ గౌడ్,అనిల్ కుమార్, రామచంద్రం, రవీందర్ రెడ్డి, రామ్ కిషన్, దశరథం, శ్రీనివాస్, హరికృష్ణ,ఎల్లం, రాజు, సురేందర్ రెడ్డి,సురేందర్, రాములు, బాలరాజు, సుధాకర్ రెడ్డి, వెంకటేశం, గోపాల్ రెడ్డి,నాగరాజు, విద్యాసాగర్ అకారం సత్తయ్య, పోచం,పర్వతం నరసయ్య,పిల్లి రాములు, విద్యాధర్ రెడ్డి, రాజనర్సింహులు, వెంకట్, కటకం రాజయ్య, కనకయ్య సీనియర్ నాయకులు ఎల్లయ్య, నర్సింలు గౌడ్, తదితరులు పాల్గొన్నారు