కాసుల వేటలో లీడర్లు,తీవ్ర మానసిక ఒత్తిడిలో అధికారులు

పయనించే సూర్యుడు మార్చి 25 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం జిల్లా: ముగ్గురు మంత్రుల ప్రోటోకాల్ నిబంధనలతో ఒత్తిడికి లోనవుతున్న అధికారులకు కొంతమంది లీడర్ల వ్యవహారం తలనొప్పిగా మారింది, నాయకులు కాసుల వేటలో పడి మానవత్వం మరచి,హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు, ఎవరికి వారు సెటిల్మెంట్ల అడ్డాలు ఏర్పాటు చేసుకుని భూదందాలు, సివిల్ పంచాయతీలు నుండి మొదలుకుని చివరకు భార్యా భర్తల పంచాయితీల వరకు “సెటిల్మెంట్లకు ఏది అనర్హం”అనే చందంగా లీడర్లు వ్యవహరించడం గమనార్హం,గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలకు విసిగిపోయిన ప్రజలు ప్రస్తుత ప్రభుత్వానికి పట్టం కడితే వ్యక్తులు,జెండాలు మాత్రమే మారాయి గానీ అంతకు మించి అరాచకాలు జరుగుతున్నాని, ముఖ్యంగా ఖమ్మంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఇలాంటి వ్యవహారాలు ముదిరి పాకాన పడ్డాయని,లీడర్ల ధన దాహం వలన వివిధ డిపార్ట్మెంట్లలో పని చేసే ఆఫీసర్లను, సామాన్య ప్రజలను అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఇటు ఉద్యోగులు,ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టికర్త ఎవరు !? ఈ మధ్య కాలంలో ఖమ్మం నగరంలో కొంత మంది చోటా,బడా నాయకులు చేస్తున్న కొన్ని వ్యవహారాలు అసలు నాయకులకు, ఆఫీసర్లకు తలనొప్పిగా తయారయ్యాయి ముఖ్యంగా వీరి వ్యవహారశైలితో పోలీస్,రెవిన్యూ,మైనింగ్ డిపార్ట్మెంట్లలో పని చేసే అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు, చీటికి మాటికి ఫోన్లు చేస్తూ ఆ పని చేయ్, ఈ పని చేయ్ అంటూ హుకుంలు జారి చేస్తుండడంతో అధికారులు కక్కలేక మింగలేక అడ్జస్ట్ అయి బ్రతకడానికి అలవాటు పడ్డారు, ఇటివల ఒక భూ వ్యవహారంలో తల దూర్చిన ఓ చోట లీడర్ ఒక వృద్ధ రిటైర్డ్ టీచరుకు సంబంధించిన 600 గజాల స్థలానికి తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి,సదరు విశ్రాంత ఉపాధ్యాయుడు,అతని భార్య మీద కేసు పెట్టీ సెటిల్మెంట్ చేయమని ఒక పోలీసు అధికారిని కోరగా ఇరువురి డాక్యుమెంట్లు పరిశీలించిన తరువాత సదరు లీడరు చూపించిన పత్రాలు ఫేక్ అని తేలడంతో నేను ఆ పని చేయనని ఇన్స్పెక్టర్ తేల్చి చెప్పడంతో ఆగ్రహానికి లోనైన సదరు లీడర్ నువ్వెలా ఇక్కడ డ్యూటీ చేస్తావో నేను చూస్తా,నిన్ను బదిలీ చేయించపోతే నా పేరు మార్చుకుంటానంటూ ఛాలెంజ్ విసిరినట్లు గుసగుసలు వినిపించాయి సెటిల్మెంట్లకు ఏది అనర్హం !? ముగ్గురు మంత్రుల ప్రోటోకాల్ నిబంధనలతో ఒత్తిడికి లోనవుతున్న అధికారులకు కొంతమంది లీడర్ల వ్యవహారం తలనొప్పిగా మారింది,నాయకులు కాసుల వేటలో పడి మానవత్వం మరచి,హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు,ఎవరికి వారు సెటిల్మెంట్ల అడ్డాలు ఏర్పాటు చేసుకుని భూదందాలు,సివిల్ పంచాయతీలు నుండి మొదలుకుని చివరకు భార్యా భర్తల పంచాయితీల వరకు “సెటిల్మెంట్లకు ఏది అనర్హం”అనే చందంగా లీడర్లు వ్యవహరించడం గమనార్హం,గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలకు విసిగిపోయిన ప్రజలు ప్రస్తుత ప్రభుత్వానికి పట్టం కడితే వ్యక్తులు,జెండాలు మాత్రమే మారాయి గానీ అంతకు మించి అరాచకాలు జరుగుతున్నాయని,ముఖ్యంగా ఖమ్మంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఇలాంటి వ్యవహారాలు ముదిరి పాకాన పడ్డాయని,లీడర్ల ధన దాహం వలన వివిధ డిపార్ట్మెంట్లలో పని చేసే ఆఫీసర్లను,సామాన్య ప్రజలను అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఇటు ఉద్యోగులు,ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖమ్మం నగరంలో “సన్న బియ్యం మాఫియా”వెనుకున్న లీడర్ ఎవరు!? అదే విధంగా మరో నాయకుడు ఖమ్మం త్రీ టౌన్ అడ్డగా మార్చుకుని అధికారం అండతో “సన్న బియ్యం”మాఫియాను పెంచి పోషిస్తున్నాడు,ఒక్కసారి గతాన్ని పరిశీలిస్తే త్రీ టౌన్ ప్రాంతంలో వారంలో ఏదో ఒక మూలన అక్రమంగా బియ్యం రవాణా చేస్తున్న వాహనాలను పోలీసులు పట్టుకునే వారు కానీ సదరు నాయకుడు ఈ దందాలో ఎంటర్ అయిన తరువాత ఇప్పటి వరకు ఒక్క వాహనం మీద కేసు కాలేదంటే పరిస్థితి ఎందాక వెళ్ళిందనే విషయం అర్థమవుతుంది, మరో నాయకుడు ఖమ్మం నగరానికి అనుకుని రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి వాగు (ఎఫ్ టి ఎల్) భూమిని కలుపుకున్నాడని డిటిసిపి అప్రూవల్ పేరుతో ఏ సౌకర్యాలు కల్పించకుండా అమ్మకాలు చేసి,ప్రశ్నించిన వారిపట్ల అధికారాన్ని అడ్డం పెట్టుకుని దురుసుగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి,అంతే కాకుండా మరో నాయకుడు గత ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల సమయంలో బారీగా వసూళ్లు చేయడంతో పాటు, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహుల దగ్గర కూడా బేరాలు మాట్లాడుతున్నట్టు స్వయంగా ఆ పార్టీ కార్యకర్తలే ఆరోపించడం విశేషం పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులపై “గుత్తా”ధిపత్యం. రఘునాథపాలెం మండలంలో ఓ ముగ్గురు అధికార పార్టీ నాయకులు చేసే అరాచకం అంత ఇంత కాదు,రెవెన్యూ కార్యాలయం, పోలీస్ స్టేషన్లో మేము చెప్పిందే వేదంగా నడవాలనే విధంగా వ్యవహరిస్తున్నారు, పువ్వాడ ఉదయ్ నగర్ అక్రమ భూదందా నుండి మట్టి మాఫియా వరకు ఈ ముఠా కనుసన్నల్లోనే నడుస్తున్నదని,పువ్వాడ ఉదయ్ ప్రభుత్వ భూములను ఆక్రమించి ప్లాట్లుగా విభజించి అమ్ముకున్న ఓ తాజా ప్రజాప్రతినిధిపై కేసులు పెట్టకుండా ఓ పోలీసు అధికారిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారని, మేము పోస్టింగ్ ఇప్పించాం మేము చెప్పినట్లే వినాలనే అహంకార పూరిత వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలిసింది,అంతే కాకుండా మండలంలో ఏ నాయకుడు పని మీద వచ్చినా మేము చెప్పేదాకా ఆ పనులు చేయొద్దని రెవిన్యూ, పోలీసు అధికారులకు సదరు నాయకులు హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది,దీంతో మండలంలోని ఇతర నాయకులు అధికారులపై గుత్తాధిపత్యంపై ఏమిటని ఈ విషయాన్ని త్వరలో మంత్రి దృష్టికి తీసుకు వెళ్తామని బహిరంగంగానే వ్యాఖ్యానించడం గమనార్హం వందల కోట్లు సంపాదించిన “మట్టి మాఫియా కింగ్ పిన్” ఎవరు!? అంతే కాకుండా “మట్టి మాఫియా”ను వెంటేసుకుని, మంత్రి తుమ్మల పేరు చెప్పి నిబంధనలకు విరుద్ధంగా బల్లెపల్లి రెవెన్యూ పరిధిలోని 146,147,148 సర్వే నెంబర్లుగల 42 ఎకరాల ప్రభుత్వ భూమిని చదును చేసే పేరు మీద, నిబంధనల ప్రకారం టెండర్లు పిలవాల్సి ఉండగా నిబంధనలు తుంగలో తొక్కి రెవెన్యూ, మైనింగ్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి “ఖమ్మం మట్టి మాఫియా కింగ్ పిన్”, అక్రమ మట్టి వ్యాపారంలో వందల కోట్లు సంపాదించిన ఒక మట్టి వ్యాపారికి నామినేటెడ్ పద్దతిలో మట్టి తవ్వకాలకు అక్రమ అనుమతులు ఇప్పించడంలో సదరు నాయకులు కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి,ఈ విషయం మీద మైనింగ్, రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తే మాది ఏముంది వాళ్ళు మంత్రి పేరు చెబుతున్నారు కాబట్టి వారు చెప్పింది చేయక తప్పడం లేదంటూ వాపోతున్నారు, చివరకు నిజాయితీగా సమాధానం చెప్పడానికి కూడా అధికారులు భయపడుతున్నారంటే లీడర్ల అరాచకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు, అధికారులు వారి పనులు వారు చేసుకొనివ్వకుండా వారిపై వీళ్ల పెత్తనాలేమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు,ఏది ఏమైనా లీడర్ల కాసుల కక్కుర్తికి అధికారులు, సామాన్య ప్రజలు మూల్యం చెల్లించుకునే పరిస్థితి దాపురించిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *