కులం పేరుతో దూషించినటువంటి శ్రీధర్ రెడ్డి అనే ఉపాధ్యాయుడుని సస్పెండ్ చేయాలి.

విచారణ కు వచ్చిన డిప్యూటీ డి ఈ ఒ తో వాగ్వాదం దిగిన ఐక్య విద్యార్ధి, ప్రజా సంఘాల నాయకులు

పయనించే సూర్యుడు 25 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ ఎమ్మిగనూరు పట్టణం ఎస్ ఎన్ ఎస్ స్కూల్ లో కులం పేరుతో దూషించినటువంటి ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు శ్రీధర్ రెడ్డి ని విధులు నుంచి తొలగించాలి అని ఐక్య విద్యార్ధి, ప్రజా సంఘాల నాయకులు శేఖర్, ఆఫ్రిది, ఉదయ్, ఖదీర్, రఘు, రహిమాన్, ఖాజా ఆధ్వర్యంలో డిప్యూటీ డి ఈ ఒ రాజేంద్ర ప్రసాద్ కి వినతిపత్రం అందచేయడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రంజాన్ పండగ సందర్బంగా స్కూల్ లో కొంతమంది ముస్లిం విద్యార్థులు తలకి టోపీ ధరించి వస్తున్నారు అలాంటి విద్యార్థులను అదే స్కూల్ ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు శ్రీధర్ రెడ్డి తలకి ధరించినా టోపీ ని తొలగించాలి అని విద్యార్థులను కులం పేరు తో దుషిస్తూ, భూతులు తిడుతూ భయభ్రాంతులు గురిచేస్తున్నాడు. ఈ విషయం పై మత పెద్దలు వచ్చి ఉపాధ్యాయుడు ని మందలించడం జరిగింది. కానీ మరుసటి రోజే యాదవిధిగా విద్యార్థులను తలకి ధరించినా టోపీ ని తీయాలి అని పదే పదే ఒత్తిడి చేయడం తో విద్యార్థులు విద్యార్ధి సంఘాల ద్రుష్టి కి తీసుకొని రావడం తో ఆర్ పి ఎస్ ఎఫ్ విద్యార్ధి సంఘము తరుపున పి జి ఆర్ ఎస్ లో ఫిర్యాదు చేయగా విద్య శాఖ కమీషనర్ తీవ్రంగా స్పందించి మూడు రోజులలో విచారణ చేయాలి అని డి ఈ ఒ కి ఆదేశించగా వారు డిప్యూటీ డి ఈ ఒ కి విచారణ అధికారిగా నియమించడం తో వారు ఈరోజు విచారణకి రాగ విచారణలో భాగంగా స్కూల్లో చదువుతున్న తొమ్మిది, ఎనిమిది తరగతి ముస్లిమ్స్ విద్యార్థలు ను వేధిస్తున్న ఉపాధ్యాయుడు శ్రీధర్ రెడ్డి పై లికిత పూర్వకంగా వినతిపత్రం రాసి ఇవ్వడం జరిగింది. అలాగే విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం ని డిప్యూటీ డి ఈ ఒకి అందచేసి సమగ్రమైన విచారణ చేసి ఉపాధ్యాయుడు శ్రీధర్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలి అని లేనిపక్షం లో విద్య శాఖ మంత్రి నారా లోకేష్ కి ద్రుష్టి కి తీసుకెళ్తామని అని హేచ్చరించారు . అనంతరం డిప్యూటీ డి ఈ ఒ విచారణ చేసి జిల్లా విద్య శాఖ అధికారులకు రిపోర్ట్ రాసి పంపిస్తాము అని అలాగే విద్యార్థులకు న్యాయం చేస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం నాయకులు బాబా, అసద్, సందీప్, ప్రదీప్, విష్ణు తదితరులు పాల్గున్నారు