కేఆర్ మురహరి రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటీ వింగ్ అధ్యక్షుడు ముల్లా రఫీ

★ పూలమాలవేసి శాలువాతో సన్మానించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన నాయకులు ★ రంజాన్ మాసంలో మనసు మనోభావాలు పవిత్రం అవుతాయి కె ఆర్ మురహరి రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 25, 2026 గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ ఎమ్మిగనూరు పట్టణంలోని హెచ్.బి.యస్ కాలనీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, కె.ఆర్. మురహరి రెడ్డి వైసీపీ కార్యాలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గోనెగండ్ల మండల ఐటి విభాగ అధ్యక్షులు గంజహల్లి ముల్ల రఫీక్ మరియు నరసింహ ఆచారి, పూర్ణ నాయుడు తదితరులు కె.ఆర్. మురహరి రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలుసుకొని పూల మాల, శాలువా వేసి సన్మానించారు. రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా కె.ఆర్. మురహరి రెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం మానవ జీవితానికి మార్గదర్శకమైన విలువలను అందించే గొప్ప కాలమని అన్నారు. ఉపవాస దీక్ష ద్వారా మనస్సు, మనోభావాలు పవిత్రం అవుతాయని, దానం, సేవా భావం ద్వారా సమాజంలో పరస్పర ప్రేమాభిమానాలు పెరుగుతాయని తెలిపారు. మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవంతో, సౌహార్దంతో జీవించాల్సిన అవసరం ఉందని, రంజాన్ పండుగ మనందరికీ ఐక్యత, శాంతి మరియు సోదరభావానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు.అనంతరం పార్టీ సంస్థాగతంపై చర్చించుకున్నారు. తాలూకా, మండల, గ్రామ స్థాయి కమిటీల్లో పదవు పొందిన ప్రతి ఒక్కరూ నాతో సహా వైసీపీ పార్టీ గెలువు అధికారమే ద్యేయంగా కృషి చేయాలనీ దిశా నిర్దేశ చేశారు. మాపై నమ్మకంతో నాయకులు ఇచ్చిన పదవులకు న్యాయం చేసి గెలుపే లక్ష్యంగా పని చేస్తామని ఐటి విభాగ అధ్యక్షులు ముల్లా రఫీ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కిరణ్, ఎమ్మిగనూరు నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు నాయక్ ఎండి షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.