పయనించే సూర్యుడు-25-03-2026-రాజంపేట న్యూస్ : క్షయ వ్యాధి నివారణకు కలిసికట్టుగా కృషి చేద్దామని సబ్ కలెక్టర్ హెచ్.ఎస్ భావన పిలుపునిచ్చారు. మంగళవారం ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా రాజంపేట డివిజనల్ టి.బి యూనిట్ ఆధ్వర్యంలో టి.బి ముక్త్ భారత్ పంచాయతీలో ఎంపికైన వారికి అర్హత పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ హెచ్.ఎస్ భావన పాల్గొని టీ.బీ ర్యాలీని జండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ఏరియా ఆసుపత్రి నుండి మార్కెట్ వరకు కొనసాగింది. అనంతరం ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ బాలరాజు మరియు హెల్పింగ్ హాండ్స్ సంస్థ ఆధ్వర్యంలో చెయ్య వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం అందించారు. ఈ కార్యక్రమంలో టి.బి వైద్యాధికారి డాక్టర్ శరత్ కమల్, ప్రభుత్వ వైద్యులు బ్రహ్మేంద్ర, అనిల్ లక్ష్మీప్రసన్న, సౌజన్య, వికాస్, టీ.బీ సూపర్వైజర్ జయప్రకాష్, సబ్ యూనిట్ అధికారి దాస్, సూపర్వైజర్లు రవి, చెన్నమ్మ, గురప్ప, విజయకుమారి, సి.హె.చ్.ఓ లు, ఏఎన్ఎంలు, ఆశాలు, అన్నమాచార్య కళాశాల ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు.